Chandrababu vs Jagan : అది 2015.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాలేదు. బోటాబోటీ మెజార్టీ మాత్రమే ఉంది. పైగా ఎమ్మెల్సీ ఎన్నికలు.. అప్పటికే అన్ని వ్యవస్థలూ కేసీఆర్ కంట్రోల్లోకి వెళ్లాయి. టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా కేసీఆర్ ఫోల్డ్‌లోకి వెళ్లాడు. కాకపోతే ఈ విషయాన్ని టీడీపీ పసిగట్టలేకపోయింది. సీన్ కట్ చేస్తే రేవంత్‌రెడ్డి స్టీఫెన్‌కు డబ్బులు ఇస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ‘బ్రీఫ్డ్ మీ’ ని చంద్రబాబు ఫోన్లో చిక్కిపోయాడు. ఒక్కసారిగా కేసీఆర్ లైన్లోకి వచ్చాడు. దెబ్బకు పీఛేమూడ్. ఎర్రబెల్లి దయాకర్‌రావు గులాబీ కండువా కప్పుకున్నాడు. రేవంత్‌రెడ్డి జైలుకు వెళ్లాడు. ఆ కేసులో అన్ని ఆధారాలూ ఉన్నాయి. కాకపోతే చంద్రబాబు అరెస్ట్ కాలేదు. మొదట్లో హడావుడి జరిగిన కేసు.. తర్వాత చప్పపడింది. ఎందువల్ల, ఎవరికోసం, ఏ ప్రయోజనాల కోసం అనేది పక్కన పెడితే బాబు సేఫ్. అంతటి కాకలు తీరిన కేసీఆర్ బాబును అరెస్ట్ చేయించలేదు. ఇకపై చేయించడు కూడా. మొత్తానికి కేసు కోల్ట్ స్టోరేజీలోకి వెళ్లినట్టే. ఇప్పుడు ఏపీలోకి వద్దాం.
స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్ అయ్యాడు. జగన్ లండన్ వెళ్లాక ఈ పరిణామం జరగడం ఒకింత ఆశ్చర్యమే. ‘స్టే లు తెచ్చుకోవడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబును అరెస్ట్ చేయడం అంటే మాములు విషయం కాదు. ఏ విచారణనూ తన దగ్గరకు రానివ్వని సమర్థుడు చంద్రబాబు. ఏం చేసినా వ్యవహారాలను చట్టపరంగా దొరక్కుండా చేయడంలో నిపుణుడు’ అంటూ ఇన్నాళ్లూగా సాగిన ప్రచారం ఉత్తదేనా? అంతటి చంద్రబాబు కూడా అరెస్ట్‌లకు, కేసులకు అతీతుడు కాదా? అనే ప్రశ్నలు ఏపీలోనే కాకుండా తెలంగాణలోనూ ఉత్పన్నమవుతున్నాయి.
వాస్తవానికి అమరావతి రాజధాని విషయంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని మొదటి నుంచి జగన్ ఆరోపిస్తూనే ఉన్నాడు. అయితే ఆ కేసులోనే చంద్రబాబును ఫిక్స్ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఎవరూ అంచనా వేయని విధంగా స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో అరెస్ట్ చేసింది ఏపీ పోలీసు యంత్రాంగం. పైగా తనను అరెస్ట్ చేస్తారని రెండు, మూడు రోజులు చంద్రబాబే చెబుతు న్నాడు. అంటే పోలీస్ విభాగంలో ఏం జరుగుతుందో ఆయనకు తెలుస్తోందనే కదా!
గతంలో జగన్ 16 నెలల పాటు జైల్లో ఉన్నాడు. అప్పుడు కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆ కేసులో అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఇంప్లీడ్ అయ్యాడు. జగన్‌ను విడుదల చేయాలని నాడు విజయలక్ష్మి, షర్మిల, భారతి రోడ్డు మీదకు వచ్చారు. సేమ్ సీన్ ఇవ్వాళ భువనేశ్వరి కూడా వచ్చారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తున్నప్పుడు ఎఫ్ఐఆర్లో ఆయన పేరు లేదు, గవర్నర్ అనుమతి తీసుకోలేదు అన్ని ఎన్ని ప్రశ్నలు వేసినా జగన్ వినిపించుకోడు. పరిస్థితులు ఎలా ఎదురుతిరిగినా సరే, పరిణామాలు ఎంత ప్రతికూలంగా మారిన సరే జగన్ వెనక్కి తిరిగి పోడు. సరిగ్గా ఇక్కడే జగన్‌ను తక్కువ అంచనా వేసి అటు చంద్రబాబు, ఇటు రామోజీ, రాధాకృష్ణ బ్యాచ్ పప్పులో కాలేసింది. ఇప్పుడు వారు ఉదయం నుంచీ దుర్మార్గం, కక్ష సాధింపు, వంటి పదాలు వాడినా జగన్ పల్లెత్తు స్పందించడు. మార్గదర్శి మీద నట్లు బిగిస్తున్న ప్పుడు, పోలవరం నుంచి రామోజీరావు వియ్యంకుడిని పీకే సినప్పుడు జగన్ సాధింపులు తుపాకీ ఎక్కు పెట్టే ఉంద ని.. చంద్రబాబుకు కూడా అర్థమయ్యే ఉంటుంది. ఈకేసు లోనూ బలమైన ఆధారాలను సంపాదించి, ఆల్రెడీ కొంద ర్ని ఏపీ ప్రభుత్వ పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పుడే ఏపీ సీఐడీ సంకెళ్లు తన కోసం బయలుదేరుతున్నాయని చంద్ర బాబుకూ అర్థమయ్యే ఉంటుంది.
ఈ పరిణామం చూస్తుంటే జయలలిత, కరుణానిధి వ్యవహారం గుర్తుకు వస్తోంది. ఇలాంటి కక్ష సాధింపు అరెస్టులు దక్షిణ భారతంలో కొత్తేమీ కాదు. కాకపోతే ఆ అరెస్టులు నిలుస్తాయా? కేసులు బలంగా ఉంటాయా? అనేది వేరే సంగతి. అసలు చంద్రబాబును జగన్ అరెస్ట్ చేయడమే ఓ పెద్ద విశేషం. అసలు ఈ కేసులో ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే.. ప్రొసీజర్ ప్రకారం చంద్రబాబు ఎక్కడా ఎందులోనూ దొరక్కుండా జాగ్రత్తపడతాడు. కానీ ఈ స్కీంలో దొరికిపోయాడు. అసలు ఆ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం ఏమిటో చాలా మంది రాస్తూనే ఉన్నారు. దాని గురించి ఏకరువు పెట్టడం ఇక్కడ అనవసరం. చంద్రబాబు ఖాతాలో పడాల్సిన పెద్ద కేసులతో పోల్చితే ఇది చిన్న కేసే కావొచ్చు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం జరుగుతోంది. కాకపోతే పవన్ కల్యాణ్, రాధాకృష్ణను కాకుండా ఏకంగా చంద్రబాబును, రామోజీరావును జగన్ టార్గెట్ చేశాడు. కూటమిని కూకటి వేళ్లతో పీకేసే ప్రయత్నం ప్రారంభించాడు. కానీ జగన్ టార్గెట్ వేరే ఉంది. స్థూలంగా చెప్పాలంటే పిక్చర్ అబీ బాకీ హై దోస్త్!
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Cm jagan has a different plan regarding the arrest of chandrababu
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com