https://oktelugu.com/

Baby movie OTT : షాకింగ్ ట్విస్ట్… కట్స్ లేకుండా ఓటీటీలో బేబీ మూవీ, ఎన్ని గంటల నిడివో తెలుసా?

బేబీ మూవీ ఇప్పటి వరకు రూ. 85 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సమాచారం. వంద కోట్ల వసూళ్లు సాధ్యమే అంటున్నారు. బ్రో విడుదల ఒకింత దెబ్బతీసింది. చాలా చోట్ల మరలా బేబీ చిత్రంతో బ్రో థియేటర్స్ రీప్లేస్ చేస్తున్నట్లు సమాచారం.

Written By:
  • NARESH
  • , Updated On : August 4, 2023 / 09:17 AM IST
    Follow us on

    Baby movie OTT : 2023 సెన్సేషన్ గా అవతరించింది బేబీ. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్ బస్టర్ కొట్టింది. దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించిన ఈ ట్రైయాంగిల్ లవ్ డ్రామా బేబీ మొదట్లో మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఎమోషనల్ గా కనెక్ట్ అయినా నిడివి బాగా ఎక్కువగా ఉంది. సినిమాను సాగదీశారనే కామెంట్స్ వినిపించాయి. సినిమా రోజు రోజుకూ పుంజుకుంటూ వెళ్ళింది. బేబీ విడుదలై మూడు వారాలు అవుతున్నా కలెక్షన్స్ తగ్గలేదు. బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగుతోంది.

    బేబీ మూవీ ఇప్పటి వరకు రూ. 85 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సమాచారం. వంద కోట్ల వసూళ్లు సాధ్యమే అంటున్నారు. బ్రో విడుదల ఒకింత దెబ్బతీసింది. చాలా చోట్ల మరలా బేబీ చిత్రంతో బ్రో థియేటర్స్ రీప్లేస్ చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే బేబీ ఓటీటీ వెర్షన్ గురించి ఓ షాకింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. బేబీ ఓటీటీ వెర్షన్ ఎలాంటి కట్స్ లేకుండా విడుదల చేయబోతున్నారట.

    ఒక పాటతో పాటు మరికొన్ని సీన్స్ ఉంటాయట. మొత్తంగా బేబీ సినిమా నిడివి 4 గంటలకు పైగా ఉంటుందట. ఈ మేరకు ఓ వార్త టాలీవుడ్ లో సంచలనం రేపుతోంది. థియేటర్లో సినిమాను సుదీర్ఘంగా చెప్పలేము. అప్పటికీ బేబీ మూవీ నిడివి దాదాపు 3 గంటలు. ఓటీటీలో మరో గంట అదనంగా ఉంటుందట. ఈ న్యూస్ కాకరేపుతుంది. ఇదే నిజమైతే మూవీ లవర్స్ మరోసారి బేబీ కోసం ఓటీటీలో ఎగబడి సూచనలు కలవు. బేబీ ఆహా, నెట్ఫ్లిక్స్ లో ప్రసారం కానుందట.

    బేబీ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ ప్రధాన పాత్రలు చేశారు. సమకాలీన ప్రేమ కథను వాస్తవాలకు దగ్గరగా బోల్డ్ గా చెప్పడంతో కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా యూట్యూబర్ వైష్ణవి చైతన్య గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ఆమెకు భారీ ఫేమ్ వచ్చింది. బేబీ చిత్రాన్ని ఎస్కేఎన్ నిర్మించారు. వైష్ణవి చైతన్యకు టాలీవుడ్ లో ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయి. అల్లు శిరీష్ కి జంటగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఒక మూవీకి సైన్ చేసిందట. దర్శకుడు పూరి జగన్నాధ్ డబుల్ ఇస్మార్ట్ మూవీకి ఎంపిక చేశాడనే ప్రచారం జరుగుతుంది.