Pranati Rai Prakash: అన్నీ విప్పి చూపించేసింది.. పిచ్చెక్కిస్తున్న ‘దాస్ కా దమ్కీ’ బ్యూటీ

ప్రణతిరాయ్ ప్రకాశ్ డెహ్రడూన్ లో జన్మించారు. ఆమె స్వస్థలం బీహార్ లోని పాట్నా. ఆమె తండ్రి ఆర్మీలో ఉద్యోగం చేయడం వల్ల ప్రణతి పలు ప్రాంతాలు తిరగాల్సి వచ్చింది.

  • Written By: SS
  • Published On:
Pranati Rai Prakash: అన్నీ విప్పి చూపించేసింది.. పిచ్చెక్కిస్తున్న ‘దాస్ కా దమ్కీ’ బ్యూటీ

Pranati Rai Prakash: సినిమాల్లో స్టార్ ఇమేజ్ రావాలంటే నటన మాత్రమే కాదు.. ఆవగింజతంత అదృష్టం ఉండాలి.. అలా ఉంటేనే ఒక్క సినిమా అయిన సరే స్టార్ అయిపోతారు. ఫస్ట్ మూవీతోనే హిట్టు కొట్టిన సుందరీమణులు ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నారు. ఇప్పటికీ వస్తూనే ఉన్నారు. అయితే లేటేస్టుగా సినిమాల్లోనే కాకుండా స్పెషల్ సాంగ్స్ తో కూడా తమ పర్ఫామెన్స్ చూపిస్తున్నారు. ఒకే ఒక్క సాంగ్ తో ఫేమస్ హీరోయిన్ గా మారిపోతున్నారు. లేటేస్టుగా ‘దాస్ కా దమ్కీ’ అనే మూవీలోని సాంగ్ తో గుర్తింపు తెచ్చుకుంది ప్రణతి రాయ్ ప్రకాశ్. ఈ సాంగ్ తో ఫేమస్ అయిన ఆమె వెంటనే మరో సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. అయితే లేటేస్టుగా ఈ భామ పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రణతిరాయ్ ప్రకాశ్ డెహ్రడూన్ లో జన్మించారు. ఆమె స్వస్థలం బీహార్ లోని పాట్నా. ఆమె తండ్రి ఆర్మీలో ఉద్యోగం చేయడం వల్ల ప్రణతి పలు ప్రాంతాలు తిరగాల్సి వచ్చింది. దీంతో ఆమెకు మోడలింగ్ పై ఇంట్రెస్ట్ పడింది. చదువు పూర్తయిన తరువాత మోడలింగ్ నేర్చుకున్న ఆమె ఆ తరువాత 2015లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నారు. ఆ తరువాత ఫెమినా మిస్ ఇండియాలో మిస్ టాలెంటెడ్, మిస్ ఫ్యాషన్ ఐకాన్ టైటిల్స్ ను గెలుచుకుంది.

ఆ తరువాత సినిమాల్లో ఛాన్స్ వస్తే నటించాలనుకుంది. ఈ క్రమంలో ఆమె ముందుగా టెలివిజన్ రంగంలో అడుగుపెట్టింది. 2016లో ఎం టీవీలో ఓ కార్యక్రమంలో నటించారు. ఆ తరువాత 2019లో ఠాకూర్ గంజ్ కుటుంబం అనే వెబ్ సిరీస్ లో నటించారు. ఇక తెలుగులో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ‘దాస్ కా దమ్కీ’ అనే సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించారు. అయితే ప్రస్తుతం ఇదే విశ్వక్ సేన్ తో ‘ఓ డాలర్ పిల్లా’ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఇంతలో ప్రణతికి సంబంధించిన లేటేస్ట్ పిక్స్ అలరిస్తున్నాయి. ఇందులో ప్రణతి హాట్ హాట్ గా ఫోజులిచ్చింది. అందాల ఆరబోతలో తగ్గేతేలే అంటూ కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టడంతో అవి వైరల్ గా మారాయి. ఈ ఫొటోలను చూసిన కొందరు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అయితే ప్రణతి ఇంతటితో ఆగుతుందా..? మరిన్ని అవకాశాలు తెచ్చుకుంటుందా? అనేది చూడాలి.

సంబంధిత వార్తలు