Kangana Ranaut: ఏక్ నిరంజన్ సెట్స్ లో ప్రభాస్ నన్ను టీజింగ్ చేశాడు… కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్

కంగనా రనౌత్ హీరోలపై లైంగిక ఆరోపణలు కూడా చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఆమె హీరో ప్రభాస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఏక్ నిరంజన్ మూవీ సెట్స్ లో ఆయన నన్ను టీజ్ చేశాడని అన్నారు.

  • Written By: Shiva
  • Published On:
Kangana Ranaut: ఏక్ నిరంజన్ సెట్స్ లో ప్రభాస్ నన్ను టీజింగ్ చేశాడు… కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్

Kangana Ranaut: ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఏం మాట్లాడినా సంచలనమే. బాలీవుడ్ లో స్టార్ గా ఎదిగిన కంగనా అక్కడి పెద్దలను ఎదిరించింది. కరణ్ జోహార్, కరీనా కపూర్, అలియా భట్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, మహేష్ భట్ తో పాటు పలువురికి వ్యతిరేకంగా ఆమె గళమెత్తారు. నెపోటిజం కారణంగా అవుట్ సైడర్స్ ని తోక్కేస్తున్నారు అనేది ఆమె ప్రధాన ఆరోపణ. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య సంఘటన ఆమె సీరియస్ గా తీసుకున్నారు. కరణ్ జోహార్ తో పాటు మరికొందరు అందుకు కారణమయ్యారని సోషల్ మీడియాలో యుద్ధం చేసింది.

కంగనా రనౌత్ హీరోలపై లైంగిక ఆరోపణలు కూడా చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఆమె హీరో ప్రభాస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఏక్ నిరంజన్ మూవీ సెట్స్ లో ఆయన నన్ను టీజ్ చేశాడని అన్నారు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ప్రభాస్ ఏక్ నిరంజన్ టైటిల్ తో యాక్షన్ ఎంటర్టైనర్ చేశాడు. 2009లో విడుదలైన ఈ మూవీలో కంగనా రనౌత్ హీరోయిన్. ఆ చిత్ర సెట్స్ లో జరిగిన సంగతులు చాలా కాలం అనంతరం కంగనా రనౌత్ గుర్తు చేసుకుంది.

ప్రభాస్ నేను ఏక్ నిరంజన్ సెట్స్ లో సరదాగా ఉండేవాళ్ళం. ఒకరినొకరం టీజ్ చేసుకునేవాళ్లం. ఆయన నన్ను ఆట పట్టిస్తే నేను కూడా టీజ్ చేసే దాన్ని. అప్పుడు మేము ఇద్దరం యంగ్ ఏజ్ లో ఉన్నాం. ఇప్పుడు ప్రభాస్ బాగా మారిపోయాడు. అతడు గ్లోబల్ స్టార్ అయ్యాడు. ప్రభాస్ తో పని చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ప్రభాస్ తో పని చేసిన ఏ హీరోయిన్ అయినా ఆయన ట్రీట్మెంట్ కి పడిపోతారు.

ఇక కంగనా రనౌత్ నటించిన లేటెస్ట్ మూవీ చంద్రముఖి 2. లారెన్స్ హీరోగా నటిస్తున్నాడు. 2005లో విడుదలైన రజినీకాంత్ చంద్రముఖి చిత్రానికి ఇది కొనసాగింపు. రజనీకాంత్, జ్యోతిక తమ అద్భుత నటనతో ఓ బెంచ్ మార్క్ సెట్ చేశారు. ఈ క్రమంలో చంద్రముఖి 2 లారెన్స్, కంగనాకు ఛాలెంజ్ అని చెప్పాలి. చంద్రముఖి 2 సెప్టెంబర్ 28న విడుదల కానుంది.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు