‘బాహుబలి’ని భయపెట్టిన కరోనా!

చైనాలో సోకిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. కరోనా పేరు చెబితేనే ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. 60కిపైగా దేశాల్లో విస్తరించిన కరోనా వైరస్ తాజాగా ఇండియాకు రావడంతో భారతీయులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కేంద్రం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారు. ప్రత్యేకంగా రూ.100 కోట్ల నిధులు కూడా కేటాయించింది. దేశంలో 18 కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ దెబ్బతో అన్నిరంగాలపై ప్రభావం చూపుతుంది. ఈ వైరస్ భయంతో ఇప్పటికే విదేశాల్లో చేయాల్సిన […]

  • Written By: Neelambaram
  • Published On:
‘బాహుబలి’ని భయపెట్టిన కరోనా!

చైనాలో సోకిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. కరోనా పేరు చెబితేనే ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. 60కిపైగా దేశాల్లో విస్తరించిన కరోనా వైరస్ తాజాగా ఇండియాకు రావడంతో భారతీయులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కేంద్రం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారు. ప్రత్యేకంగా రూ.100 కోట్ల నిధులు కూడా కేటాయించింది. దేశంలో 18 కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.

కరోనా వైరస్ దెబ్బతో అన్నిరంగాలపై ప్రభావం చూపుతుంది. ఈ వైరస్ భయంతో ఇప్పటికే విదేశాల్లో చేయాల్సిన షూటింగ్ లు ఆగిపోయాయి. తాజాగా కరోనా వైరస్ ‘బహుబలి’ ప్రభాస్ ను కూడా భయపెటింది. కరోనా వైరస్ పై ముందస్తుగా జాగ్రత్తగా డార్లింగ్ ప్రభాస్ మాస్క్ వేసుకొని బయటకు వస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ మాస్క్ తో ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో ప్రభాస్ జోడీగా ఫూజా హెగ్డే నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా సందర్భంగా ప్రభాస్ మాస్క్ లు ధరించి షూటింగ్లో పాల్గొన్నట్లు సమాచారం. ఈ మూవీ పూర్తయిన తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ చేయనున్నాడు. ఇందులో ప్రభాష్ బాలీవుడ్ మూవీ ‘క్రిష్’ తరహా మాదిరిగా సూపర్ హీరో పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. వైజయంతీ మూవీస్ బ్యానర్లలో భారీ బడ్జెట్లో ఈ మూవీని తెరకెక్కించనున్నారు. ఇటీవలే చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ అధికారికంగా ఈ మూవీని ప్రకటించాడు. త్వరలోనే షూటింగ్ ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నహాలు మొదలుపెట్టింది.

సంబంధిత వార్తలు