Prabhas Salaar Teaser: సలార్ లో ఆ నటుడా..! వద్దు బాబోయ్, సాహో సెంటిమెంట్ కి భయపడుతున్న ఫ్యాన్స్
కెజిఎఫ్ పార్ట్ 1లో యష్ తర్వాత బాగా హైలెట్ అయిన పాత్ర అనంత్ నాగ్ ది. సీనియర్ జర్నలిస్ట్ గా ఓ మీడియా హౌస్లో కూర్చొని రాఖీ భాయ్ గురించి చెప్పే విధానంగా సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. కొన్ని కారణాలతో అనంత్ నాగ్ కెజిఎఫ్ 2 చేయలేదు. ఆ పాత్రను ప్రకాష్ రాజ్ చేశారు. సలార్ కూడా అదే తరహా పాత్ర ఒకటి ఉంది. టీజర్లో ఆ పాత్రను పరిచయం చేశాడు.

Prabhas Salaar Teaser: దర్శకుడు ప్రశాంత్ నీల్ హీరోలకు దిమ్మతిరిగే ఎలివేషన్స్ ఇస్తాడు. ఆయన ఎలివేషన్స్ ఓవర్ గా అనిపించవు. సీన్ ని పండించేలా, చూసేవాళ్లకు గూస్ బంప్స్ కలిగేలా ఉంటాయి. కెజిఎఫ్ సిరీస్లో రాఖీ భాయ్ పాత్రకు ఆయన ఇచ్చిన ఎలివేషన్స్ నభూతో నభవిష్యతి. ఒక హీరో క్యారెక్టర్ ని అలా లేపడం మామూలు విషయం కాదు. అదే సమయంలో కథలో దమ్ము లేకుండా హీరో క్యారెక్టర్ ని అతిగా చూపిస్తే సెట్ కాదు. దర్శకుడు ప్రశాంత్ నీల్ స్క్రీన్ ప్లే, స్టోరీ ఉన్నతంగా ఉంటాయి. అందుకే కెజిఎఫ్ చిత్రాలు బాక్సాఫీస్ ని ఏలాయి.
కెజిఎఫ్ పార్ట్ 1లో యష్ తర్వాత బాగా హైలెట్ అయిన పాత్ర అనంత్ నాగ్ ది. సీనియర్ జర్నలిస్ట్ గా ఓ మీడియా హౌస్లో కూర్చొని రాఖీ భాయ్ గురించి చెప్పే విధానంగా సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. కొన్ని కారణాలతో అనంత్ నాగ్ కెజిఎఫ్ 2 చేయలేదు. ఆ పాత్రను ప్రకాష్ రాజ్ చేశారు. సలార్ కూడా అదే తరహా పాత్ర ఒకటి ఉంది. టీజర్లో ఆ పాత్రను పరిచయం చేశాడు.
సీనియర్ నటుడు టిల్లు ఆనంద్ తో టీజర్ ప్రారంభమైంది. ఆయన గూస్ బంప్స్ తెప్పించే ఓ డైలాగ్ చెప్పాడు. ”అడవిలో చిరుత, లయన్, ఎలిఫెంట్, టైగర్ ప్రమాదకరం. కానీ జురాసిక్ పార్క్ లో కాదు” అని ఆయన చెప్పడం ఆకట్టుకుంది. కెజిఎఫ్ మూవీలో జర్నలిస్ట్ పాత్రను టిల్లు ఆనంద్ పాత్ర పోలి ఉంది. అయితే టిల్లు ఆనంద్ సలార్ లో నటించడాన్ని కొందరు ఇష్టపడటం లేదు. అది బ్యాడ్ సెంటిమెంట్ గా భావిస్తున్నారు.
కారణం సాహో. ఈ చిత్రంలో ప్రభాస్ ఫాదర్ టైగర్ ష్రాఫ్ మాఫియా వరల్డ్ కి కింగ్ గా ఉంటాడు. ఆయన క్రింద పని చేసే డాన్స్ లో ఒకడిగా టిల్లు ఆనంద్ నటించారు. సాహో పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. ప్రభాస్ ఖాతాలో ప్లాప్ మూవీగా నిలిచిపోయింది. ఈ క్రమంలో టిల్లు ఆనంద్ ని మళ్ళీ ఎందుకు తీసుకున్నారు? కలిసి రాని నటుడితో పనిచేయడం అవసరమా అంటున్నారు. దీన్నో బ్యాడ్ సెంటిమెంట్ గా భావిస్తున్నారు. కాగా సలార్ సెప్టెంబర్ 28న విడుదల కానుంది. శృతి హాసన్ హీరోయిన్ కాగా…. జగపతిబాబు, పృథ్విరాజ్ సుకుమారన్ కీలక రోల్స్ చేస్తున్నారు.