Akhil New Movie: ప్రభాస్ – రామ్ చరణ్ నిర్మాతలుగా అఖిల్ తో కొత్త సినిమా..ఈసారైనా అయ్యగారు హిట్ కొడతాడా?
ఇద్దరు స్టార్ హీరోలు కలిసి జాయింట్ గా ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టడం ఇది వరకు ఎప్పుడు జరగలేదు. ఆ ట్రెండ్ కి నాంది పలికారు రామ్ చరణ్ – ప్రభాస్. వ్యక్తిగతంగా వీళ్లిద్దరు ఎంత మంచి స్నేహితులో ‘అన్ స్టాపబుల్’ షో ద్వారా అందరికీ తెలిసే ఉంటుంది.

Akhil New Movie: టాలీవుడ్ హీరోలు కేవలం యాడ్స్ మాత్రమే కాకుండా వ్యాపార రంగం లోకి కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఒక్క పవన్ కళ్యాణ్ మినహా మిగిలిన అందరూ హీరోలు వ్యాపారాలు చేస్తున్నారు. అది ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది, కాస్త పేరు వచ్చి డబ్బులు సంపాదిస్తున్న మీడియం రేంజ్ హీరోలు కూడా నిర్మాతలుగా మరియు బిజినెస్ పార్టనర్స్ గా వ్యవహరిస్తున్నారు.
కానీ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి జాయింట్ గా ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టడం ఇది వరకు ఎప్పుడు జరగలేదు. ఆ ట్రెండ్ కి నాంది పలికారు రామ్ చరణ్ – ప్రభాస్. వ్యక్తిగతంగా వీళ్లిద్దరు ఎంత మంచి స్నేహితులో ‘అన్ స్టాపబుల్’ షో ద్వారా అందరికీ తెలిసే ఉంటుంది. ప్రభాస్ కి యూవీ క్రియేషన్స్ లో పార్టనర్ షిప్ ఉంది. ఆయనతో పాటుగా ఆయన అన్నయ్య ప్రబోధ్ మరియు స్నేహితులు కూడా ఈ బ్యానర్ లో ఉన్నారు.
అయితే ఇప్పుడు రామ్ చరణ్ మరియు యూవీ క్రియేషన్స్ కలిపి ‘V మెగా పిక్చర్స్’ అని ఒక బ్యానర్ ని స్థాపించారు. ఈ బ్యానర్ ద్వారా కొత్త టాలెంట్ ని ప్రోత్సహించడమే కాకుండా, తమ తోటి స్టార్ హీరోలతో కూడా సినిమాలు చెయ్యబోతున్నాడు. ముందుగా మొదటి సినిమా అక్కినేని అఖిల్ తో తియ్యబోతున్నారట.డైరెక్టర్ ఎవరు ఏమిటి అనేది త్వరలోనే తెలియనుంది. ఈ ప్రాజెక్ట్ తర్వాత రామ్ చరణ్ – లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ సినిమా కూడా తెరకెక్కబోతుందట.
ఇలా క్రేజీ ప్రాజెక్ట్స్ తో పాటుగా ఇండస్ట్రీ లో ‘కార్తీక్ దండు’ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ ని వెలికితీసి ‘విరూపాక్ష’ లాంటి అద్భుతమైన సినిమాలను తెరకెక్కించబోతున్నారట. మరి రామ్ చరణ్ ఎంట్రీ తో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పరిస్థితి మారబోతుందా..?, సక్సెస్ స్ట్రీక్ లోకి రాబోతున్నారా..?,ఎంత ప్రయత్నం చేసిన సక్సెస్ అందుకోలేకపోతున్న అఖిల్ కి తమ మొదటి సినిమా ద్వారానే హిట్ ఇవ్వబోతున్నారా ? అనేది చూడాలి.
