Prabhas- Sukumar: రామ్ చరణ్ ని పక్కకు నెట్టి ప్రభాస్ కి జై కొడుతున్న సుకుమార్..?
ఎందుకంటే ఆయన సినిమా హిట్ అయినా , ఫ్లాప్ అయినా హీరో నుండి అద్భుతమైన నటనని బయటకి లాగుతాడు. అందువల్ల సదరు హీరో కి మంచి పేరు ప్రఖ్యాతలు మరియు క్రేజ్ వస్తుంది. ‘పుష్ప : ది రూల్’ తర్వాత సుకుమార్ రామ్ చరణ్ తో ఒక సినిమా చేయబోతున్నాను అని ఇది వరకే అధికారికంగా ప్రకటించారు.

Prabhas- Sukumar: పాన్ ఇండియా లెవెల్ లో టాప్ 3 డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పేరు కచ్చితంగా ఉంటుంది. పాన్ ఇండియా లెవెల్ లో ఆయన పుష్ప సినిమా తో సృష్టించిన ప్రభంజనం అలాంటిది. ఇప్పుడు ఆయన తెరకెక్కిస్తున్న ‘పుష్ప : ది రూల్ ‘ కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది.ఇప్పుడు మన టాలీవుడ్ లో ఉన్న ప్రతీ హీరో కి రాజమౌళి తర్వాత సుకుమార్ తో ఒక్క సినిమా తియ్యాలని కోరుకుంటూ ఉంటారు.
ఎందుకంటే ఆయన సినిమా హిట్ అయినా , ఫ్లాప్ అయినా హీరో నుండి అద్భుతమైన నటనని బయటకి లాగుతాడు. అందువల్ల సదరు హీరో కి మంచి పేరు ప్రఖ్యాతలు మరియు క్రేజ్ వస్తుంది. ‘పుష్ప : ది రూల్’ తర్వాత సుకుమార్ రామ్ చరణ్ తో ఒక సినిమా చేయబోతున్నాను అని ఇది వరకే అధికారికంగా ప్రకటించారు.
#RRR మూవీ షూటింగ్ సమయం లోనే వీళ్ళ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కి సంబంధించి రామ్ చరణ్ పరిచయ సన్నివేశాన్ని చిత్రీకరించేసాడు.ఈ విషయం రాజమౌళి స్వయంగా #RRR మూవీ ప్రొమోషన్స్ లో చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటంటే ‘పుష్ప : ది రూల్’ తర్వాత సుకుమార్ రామ్ చరణ్ తో కాకుండా ప్రభాస్ తో సినిమా తియ్యబోతునట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా రీసెంట్ గా ప్రభాస్ ని కలిసి ఒక అద్భుతమైన స్టోరీ లైన్ ని సుకుమార్ వినిపించాడు. ప్రభాస్ కూడా ఆ స్టోరీ విని వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు, మరి ఈ చిత్రం రామ్ చరణ్ సినిమా కంటే ముందుగా ఉంటుందా, లేదా రామ్ చరణ్ చిత్రం తర్వాత ఉంటుందా అనేది మాత్రం ఇంకా ఖారారు కాలేదు.
కానీ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి, ఇవి పూర్తి అయినా తర్వాత ఆయన అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగా తో ‘స్పిరిట్’ అనే చిత్రం చెయ్యబోతున్నాడు. కాబట్టి ఇప్పట్లో ఈ కాంబినేషన్ ఉండదు అని కూడా కొంతమంది అంటున్నారు. మరి ఈ వార్తలపై సుకుమార్ మాత్రమే క్లారిటీ ఇవ్వాలి.
