
Prabhas Health
Prabhas Health: టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడని, చికిత్స కోసం ఆయనను విదేశాలకు తరలించారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఇదంతా నిజమేనా? అన్న చర్చ సినీ ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది. కానీ గత కొన్ని రోజులుగా ప్రభాస్ రెగ్యులర్ షూటింగ్ కు హాజరు కావడం లేదని, అందుకు కారణం అనారోగ్యమేనని కొందరు అంటున్నారు. ప్రభాస్ కు సన్నిహితంగా ఉంటున్న ఓ వ్యక్తి ఇలా వస్తున్న వార్తలను ఖండించారు. ప్రభాస్ ఆరోగ్యం భాగానే ఉందని, కాస్త అస్వస్థతకు గురయ్యారని అని అన్నారు. దీంతో ఏది నిజమో? ఏదీ అబద్ధమో తెలియడం లేదని సినీ ప్రియులు టెన్సన్ పడుతున్నారు.
ప్రభాస్ ప్రస్తుతం ‘సలార్’, ‘ఆదిపురుష్’, ‘ప్రాజెక్ట్ కె’, ‘రాజా డీలక్ష్’ షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. ఏమాత్రం తీరిక లేకుండా అన్ని సినిమాల షూటింగ్ ల్లో పాల్గొంటున్నారు. ఒకేసారి వరుసబెట్టి సినిమాలకు పనిచేస్తుండడంతో ప్రభాస్ కు రెస్ట్ లేకుండా పోయింది. దీంతో ఆయన అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. ఇక ఆదిపురుష్ టీజర్ రిలీజ్ సమయంలో ప్రభాస్ మోకాళ్లకు ఆపరేషన్ జరిగింది. అప్పటి నుంచి ఆయనకు తరుచూ జ్వరం వస్తుందని అంటున్నారు. దీంతో కొన్ని రోజుల పాటు చికిత్స తో పాటు రెస్ట్ తీసుకునేందుకు విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది.

Prabhas Health
ఈ నేపథ్యంలో కొందరు ప్రభాస్ కు తీవ్ర అనారోగ్యమంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ రెగ్యులర్ చెకప్ లో భాగంగానే ప్రభాస్ విదేశాలకు వెళ్లారని అంటున్నారు. అంతేకానీ ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడడం లేదని అంటున్నారు. అయితే ప్రభాస్ వరుసగా అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో మారుతితో తీసే ‘రాజీ డీలక్స్’ సినిమా వాయిదా పడినట్లు సమాచారం. మిగతా సినిమాల షూటింగ్ ల్లో కూడా కొన్ని రోజుల పాటు ప్రభాస్ పాల్గొనే అవకాశం లేదని తెలుస్తోంది. అన్నింటికంటే ముందుగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ‘సలార్’ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. కానీ ఈ మూవీ షూటింగ్ లో ప్రభాస్ పాల్గొంటారా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉండగా ప్రాజెక్ట్ కే లో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. ఇటీవల ఆయన కూడా అనారోగ్యాన బారిన పడ్డారు. తాజాగా అమితాబ్ కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ప్రభాస్ కూడా విదేశాలకు వెళ్లడంతో ఈ మూవీకి ఎన్ని రోజుల పాటు బ్రేక్ పడుతుందోనన్న చర్చ సాగుతోంది. ఒక్క ప్రభాస్ తో చాలా సినిమాలకు బ్రేక్ అయ్యే అవకాశం ఉండడంతో ఆ సినిమాల నిర్మాతలు ప్రభాస్ రాక కోసం ఎదురుచూస్తున్నారు.