Prabhas: ఒక్క ఏడాది లో 100 సినిమాలు.. ప్రభాస్ క్రేజ్ ని ఇలా కూడా వాడుకుంటున్నారా..!
ఆయన ఫేస్ బుక్ అకౌంట్ ఒక్కసారి తెరిచి చూస్తే, ఆయన సినిమాల గురించి వేసుకున్న పోస్టుల కంటే ఇతర హీరోల సినిమాల గురించి వేసిన పోస్టులే ఎక్కువ.

Prabhas: ప్రస్తుతం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఎంత బిజీ గా ఉన్నాడో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు, ఒకపక్క సలార్ మూవీ షూటింగ్ చేస్తూనే, మరోపక్క ప్రాజెక్ట్ K మరియు డైరెక్టర్ మారుతీ తో రాజా డీలక్స్ వంటి సినిమాలు చేస్తున్నాడు. ఈరోజు ఒక సినిమా షూటింగ్ లో ఉంటే , రేపు మరొక సినిమా షూటింగ్ లో ఉంటాడు.
ఇక క్షణకాలం తీరిక లేకుండా గడుపుతున్న ఆయన ఏనాడూ కూడా తన తోటి హీరోల గురించి కోసం కానీ, తన సహాయం కోరి వచ్చిన వాళ్ళను కూడా ఉత్త చేతులతో మాత్రం తిరిగి పంపాడు. అది ఆయనలోని గొప్పతనం, ఇక చిన్న సినిమాలను ప్రోత్సహించడం లో ప్రభాస్ ఎప్పుడూ ముందు ఉంటాడు. దర్శక నిర్మాతలు కూడా ఆయన గొప్ప మనసు గురించి బాగా తెలుసు కాబట్టి, తమ సినిమా ప్రొమోషన్స్ కోసం ప్రభాస్ సహాయం తీసుకుంటూ ఉంటారు.
ఆయన ఫేస్ బుక్ అకౌంట్ ఒక్కసారి తెరిచి చూస్తే, ఆయన సినిమాల గురించి వేసుకున్న పోస్టుల కంటే ఇతర హీరోల సినిమాల గురించి వేసిన పోస్టులే ఎక్కువ. ప్రతీ సినిమా విడుదలకు ముందు శుభాకాంక్షలు తెలియచేయడం దగ్గర నుండి,ఏదైనా సినిమా విజయం సాధించినప్పుడు కూడా నిండు మనసుతో ప్రశంసించడం ఒక్క ప్రభాస్ కి మాత్రమే చెల్లింది. కేవలం చిన్న హీరోలకు మాత్రమే కాదు, తనతో పాటు సరిసమానమైన ఇమేజి ఉన్న స్టార్ హీరోల సినిమాలకు కూడా ప్రభాస్ తన బెస్ట్ విషెస్ చెప్తూ ఉంటాడు.
అలా గత ఏడాది నుండి ఇప్పటి వరకు ఆయన వంద సినిమాలకు పైగా ప్రొమోషన్స్ చేసాడని టాక్. ఇంత ఉదార స్వభావం బహుశా భారత దేశం లో ఏ హీరోకి కూడా ఉండదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే ప్రభాస్ ని అందరూ ‘మా డార్లింగ్’ అంటూ ఎంతో ప్రేమతో పిలుస్తుంటారు.
