Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ప్రాజెక్ట్ కే. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మిస్తుండగా… పాన్ వరల్డ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్, ఫాంటసి థ్రిల్లర్‌గా నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా… దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ రోల్ గురించి ఇండస్ట్రి వర్గాల్లో ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతుంది.
ఇటీవల ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా … వైజయంతీ మూవీస్ సంస్థ శుబకాంక్షలు తెలుపుతూ ” సూపర్ హీరో ప్రభాస్ ” అని పోస్ట్ లో రాశారు. గత కొంత కాలంగా ఈ చిత్రంలో ప్రభాస్ సూపర్ హీరో పాత్ర పోషిస్తాడని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే చిత్రా బృందం ఈ విధంగా పోస్ట్ చేయడంతో… ఈ వార్తలు నిజమనిపిస్తుంది. ఈ భారీ బడ్జెట్ మూవీలో ప్రభాస్ సూపర్ హీరో రోల్ లో నటిస్తున్నట్టు పలువురు సోషల్ మీడియా లో పోస్ట్ లిఉ కూడా పెడుతూ వారి అభిమానాన్ని తెలియజేస్తున్నారు.
ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న రాధే శ్యామ్ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్దం కానుండగా… సలార్, ఆది పురుష్ సినిమాలు శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఇక ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ వచ్చే ఏడాది జనవరి నుంచి మొదలు కానున్నదని టాక్ నడుస్తుంది. ప్రభాస్ ఈ సినిమా కోసం 200 రోజులు డేట్స్ కేటాయించాడని సమాచారం అందుతుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ దాదాపు 100 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారని ఇండస్ట్రి వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ప్రాజెక్ట్ కే చిత్రం 90% షూట్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగునుందని తెలుస్తోంది.