Prabhas Brother Prabodh : జైలులో చిప్పకూడు తిన్న ప్రభాస్ అన్నయ్య ప్రబోధ్.. ఇంత పెద్ద కోటీశ్వరుడు ఎలా అయ్యాడో తెలుసా..!

ప్రబోధ్ ని ప్రభాస్ అభిమానులు కూడా చాలా తక్కువగానే గానే బయట చూసారు. కానీ కృష్ణం రాజు గారు చనిపోయినప్పుడు, ఆయనకీ తలకొరివి పెడుతూ బాగా హైలైట్ అయ్యాడు.

  • Written By: Vicky
  • Published On:
Prabhas Brother Prabodh : జైలులో చిప్పకూడు తిన్న ప్రభాస్ అన్నయ్య ప్రబోధ్.. ఇంత పెద్ద కోటీశ్వరుడు ఎలా అయ్యాడో తెలుసా..!

Prabhas Brother Prabodh : టాలీవుడ్ లో స్టార్ హీరో గా కొనసాగుతూ బాహుబలి సినిమా తర్వాత పాన్ వరల్డ్ స్టార్ రేంజ్ కి ఎదిగిన హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.ఈయన గురించి ఈయన రేంజ్ గురించి, సంపాదన గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు,అందరికీ తెలిసిందే. కానీ ఆయన అన్నయ్య ప్రబోధ్ గురించి మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. సూర్య నారాయణ రాజు (కృష్ణం రాజు తమ్ముడు) కి ముగ్గురు సంతానం.

అందులో అందరికంటే పెద్ద కుమార్తె ప్రగతి, రెండవవాడు ప్రబోధ్, ఇక చివరి సంతానం మన ప్రభాస్.ప్రబోధ్ ప్రభాస్ కంటే చాలా పొడవైన మనిషి. కటౌట్ హీరో కి ఏమాత్రం తీసిపోదు.కానీ ఎందుకో ఆయన సినీ రంగం లోకి అడుగుపెట్టలేదు.కానీ తన మిత్రులు స్థాపించిన యూవీ క్రియేషన్స్ సంస్థకి ఫైనాన్స్ ఇస్తూ ఉంటాడు ప్రభోద్. సినిమా నిర్మాతగా మారితే ఒక్కోసారి లాభాలు రావొచ్చు, అలాగే నష్టాలు వచ్చినప్పుడు సూన్యం అయిపోవచ్చు. అందుకే ఎలాంటి సమస్య లేకుండా ఫైనాన్స్ చేస్తూ ఉంటాడు ఈయన.

అయితే ప్రభోద్ గతంలో చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ అయ్యి, సుమారుగా ఏడాదిపాటు జైలు జీవితం గడిపాడని అందరికీ తెలిసిన విషయమే. ఆ సమయం లో ఆయన వ్యాపారాలు కూడా దెబ్బ తిన్నాయట.కానీ బయటకి వచ్చిన తర్వాత ఎంత స్పీడ్ గా అయితే క్రింద పడ్డాడో, అంతే స్పీడ్ గా వ్యాపార రంగం లో పైకి వచ్చాడు.

అంతే కాదు ఈయనకి రాష్ట్రవ్యాప్తంగా పలు సినిమా థియేటర్స్ కూడా ఉన్నాయి. ప్రబోధ్ ని ప్రభాస్ అభిమానులు కూడా చాలా తక్కువగానే గానే బయట చూసారు. కానీ కృష్ణం రాజు గారు చనిపోయినప్పుడు, ఆయనకీ తలకొరివి పెడుతూ బాగా హైలైట్ అయ్యాడు. కృష్ణం రాజు కి కొడుకులు లేరు అనే విషయం అందరికీ తెలిసిందే, అందుకే తమ్ముడి పెద్ద కొడుకుగా కృష్ణం రాజు కి తల కొరివి పెట్టాడు ప్రబోధ్.

Read Today's Latest Gossips News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు