Prabhas Confirmed Multi-starrer : ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో మల్టీస్టారర్… కన్ఫర్మ్ చేసిన ప్రభాస్!

ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో మల్టీస్టారర్ చేయడానికి నేను సిద్ధమని ప్రభాస్ తన సమ్మతి తెలిపారు.

  • Written By: Shiva
  • Published On:
Prabhas Confirmed Multi-starrer : ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో మల్టీస్టారర్… కన్ఫర్మ్ చేసిన ప్రభాస్!

Prabhas Confirmed Multi-starrer :  శాన్ డియాగో కామిక్ కాన్ వేదికగా ప్రభాస్ కీలక ప్రకటన చేశారు. ఆర్ ఆర్ ఆర్ హీరోలతో సినిమా చేస్తా అంటూ మైండ్ బ్లాక్ అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ప్రభాస్ శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్లో సందడి చేస్తున్నారు. ఆయన లేటెస్ట్ మూవీ కల్కి కామిక్ కాన్ నుండి ఆహ్వానం పొందింది. ఈ అంతర్జాతీయ సినిమా ఈవెంట్లో కల్కి తరపున ప్రభాస్, రానా, కమల్ హాసన్, నాగ్ అశ్విన్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కామిక్ కాన్ వేదికగా కల్కి టైటిల్ అండ్ టీజర్ విడుదల చేశారు. సూపర్ హీరోగా ప్రభాస్ అంచనాలు పెంచేశారు. 

 
ఇంటర్నేషనల్ మీడియా అడిగే ప్రశ్నలకు ప్రభాస్ సమాధానం చెప్పారు. ఇండియన్ సినిమా, కల్చర్, కల్కి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రభాస్ ని ఆర్ ఆర్ ఆర్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ ల గురించి అడిగారు. భవిష్యత్తులో వారితో సినిమా చేస్తాను అన్నారు. ప్రభాస్ మాట్లాడుతూ… ఎన్టీఆర్, చరణ్ నాకు బెస్ట్ ఫ్రెండ్స్. రాబోయే రోజుల్లో వారితో సినిమాలు చేస్తాను, అన్నారు. ప్రభాస్ కామెంట్స్ ఇండియాలో ప్రకంపనలు రేపుతున్నాయి. 
 
సాధారణంగా టాలీవుడ్ లో మల్టీస్టారర్ కల్చర్ తక్కువే. సమ ఉజ్జీలైన హీరోలు ఒకే సినిమాలో నటించడానికి ఇష్టపడరు. ఫ్యాన్ వార్స్ కూడా దీనికి కారణం. బాలీవుడ్ ఈ విషయంలో చాలా ముందు ఉంది. అక్కడి స్టార్ ఎలాంటి ఇగోలు లేకుండా కలిసి సినిమాలు చేస్తారు. గెస్ట్ రోల్స్ చేయడానికి వెనుకాడరు. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో కల్చర్ మారుతుంది. నందమూరి హీరో ఎన్టీఆర్, మెగా హీరో రామ్ చరణ్ కలిసి చిత్రం చేస్తారని ఊహించలేదు. రాజమౌళి చొరవతో అది సాకారం అయ్యింది. 
 
మరి ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి మూవీ చేస్తే అతి పెద్ద సెన్సేషన్ అవుతుంది. లేదా ప్రభాస్ ఈ ఇద్దరు హీరోల్లో ఎవరితో మూవీ చేసినా రికార్డ్స్ బద్దలవుతాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో మల్టీస్టారర్ చేయడానికి నేను సిద్ధమని ప్రభాస్ తన సమ్మతి తెలిపారు. ఇక దర్శక, నిర్మాతలు కథలు సిద్ధం చేసుకోవడమే ఆలస్యం. రానున్న ఐదేళ్లలో ఈ క్రేజీ కాంబో పట్టా లెక్కవచ్చు . కొట్టిపారేయడానికి లేదు.  

Read Today's Latest Entertainment News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు