Adipurush Trailer: ఆదిపురుష్ నుండి ఊహించని అప్డేట్… ట్రైలర్ తో థియేటర్స్ దద్దరిల్లేలా!

ఆదిపురుష్ ట్రైలర్ మే 9న సాయంత్రం 5:30 నిమిషాలకు విడుదల చేయనున్నారు. అభిమానుల కోసం త్రీడి ట్రైలర్ బిగ్ స్క్రీన్ మీద ప్రదర్శించనున్నారు. ట్రైలర్ తో మూవీ మీద అంచనాలు విపరీతంగా పెంచాలని, భారీ ఓపెనింగ్స్ రాబట్టాలనేది మేకర్స్ ఆలోచనగా తెలుస్తుంది.

  • Written By: Shiva
  • Published On:
Adipurush Trailer: ఆదిపురుష్ నుండి ఊహించని అప్డేట్… ట్రైలర్ తో థియేటర్స్ దద్దరిల్లేలా!

Adipurush Trailer: ఆదిపురుష్ సక్సెస్ అటు ప్రభాస్ ఇటు దర్శకుడు ఓం రౌత్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. చిత్రం మీద భారీ హైప్ ఏర్పడేలా ప్రణాళికలు వేస్తున్నారు. ముఖ్యంగా ట్రైలర్ లాంచ్ కి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదిపురుష్ ట్రైలర్ నేరుగా థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. అది కూడా 105 థియేటర్స్ లో. ఏపీ, తెలంగాణాలలో కలిపి ఆదిపురుష్ ట్రైలర్ వందకు పైగా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.

ఆదిపురుష్ ట్రైలర్ మే 9న సాయంత్రం 5:30 నిమిషాలకు విడుదల చేయనున్నారు. అభిమానుల కోసం త్రీడి ట్రైలర్ బిగ్ స్క్రీన్ మీద ప్రదర్శించనున్నారు. ట్రైలర్ తో మూవీ మీద అంచనాలు విపరీతంగా పెంచాలని, భారీ ఓపెనింగ్స్ రాబట్టాలనేది మేకర్స్ ఆలోచనగా తెలుస్తుంది. ఆదిపురుష్ టీజర్ సైతం థియేటర్స్ లో విడుదల చేశారు. అది ప్రయోగాత్మకంగా కొద్ది థియేటర్స్ లో మాత్రమే రిలీజ్ చేశారు. ఆదిపురుష్ త్రీడి టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే సమయంలో మొబైల్స్, టెలివిజన్ లలో చూసినవారు నెగిటివ్ కామెంట్స్ చేశారు.

దీంతో ఆదిపురుష్ త్రీడీ ట్రైలర్ 105 థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. ఇతర డివైస్ లతో పాటు థియేటర్స్ లో ఆదిపురుష్ ట్రైలర్ చూడవచ్చు. ఆల్రెడీ ట్రైలర్ కట్ చేశారట. మూడు నిమిషాలకు పైగా ఉన్న టీజర్ లో విజువల్స్, యాక్షన్స్, సెంటిమెంట్ ప్రధానంగా ఉన్నాయట. ఆదిపురుష్ ట్రైలర్ పట్ల యూనిట్ సంతృప్తికరంగా ఉన్నారట. ప్రభాస్ సైతం ఇంప్రెస్ అయినట్లు సమాచారం. ఆదిపురుష్ ట్రైలర్ అప్డేట్ ఫ్యాన్స్ కి పిచ్చ కిక్ ఇచ్చింది.

దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రామాయణగాథగా తెరకెక్కింది. ప్రభాస్, కృతి సనన్… రాముడు, జానకి పాత్రలు చేస్తున్నారు. ఇక రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఆదిపురుష్ 2023 సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సింది. టీజర్ విమర్శల పాలైన నేపథ్యంలో ఆరు నెలలు విడుదల వాయిదా వేశారు. జూన్ 16న ఆదిపురుష్ వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల కానుంది.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు