Ustad Bhagath Singh – Poonam Kaur : వివాదంలో ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్… హీరోయిన్ పూనమ్ కౌర్ ఫైర్!

దేశభక్తులను మనం గౌరవించకపోయినా పర్లేదు. కనీసం అవమానించకండి. భగత్ సింగ్ పేరును హీరో కాళ్ళ వద్ద వేస్తారా? ఇది అహంకారమా? లేక అమాయకత్వమా? అని పూనమ్ ట్వీట్ చేశారు.

  • Written By: NARESH
  • Published On:
Ustad Bhagath Singh – Poonam Kaur : వివాదంలో ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్… హీరోయిన్ పూనమ్ కౌర్ ఫైర్!

Ustad Bhagath Singh – Poonam Kaur : నటి పూనమ్ కౌర్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర యూనిట్ పై ఫైర్ అయ్యారు. పోస్టర్ లో ఓ అంశాన్ని ఆమె తప్పుబట్టారు. అహంకారమా? అమాయకత్వమా? అని ప్రశ్నించారు. పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. నేడు ఈ చిత్ర ఫస్ట్ గ్లిమ్ప్స్ విడుదల చేశారు. నిమిషం నిడివి గల ఉస్తాద్ భగత్ సింగ్ ప్రోమో దుమ్మురేపింది. పవన్ కళ్యాణ్ మాస్ అవతార్, మేనరిజం, వన్ లైనర్స్ గూస్ బంప్స్ లేపాయి. ఫ్యాన్స్ ఫుల్ ఫిదా. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రోమో సూపర్ అంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఈ చిత్ర పోస్టర్ ని నటి పూనమ్ కౌర్ తప్పుబట్టారు. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రోమో ప్రకటన పోస్టర్ లో పవన్ కళ్యాణ్ కాళ్ళ వద్ద టైటిల్ ఉంచారు. నిజానికి అదేం పెద్ద నేరం కాదు. పోస్టర్స్ డిజైన్స్ దాదాపు అలానే ఉంటాయి. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ టైటిల్ లో దేశభక్తుడు పేరుంది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్ పేరును టైటిల్ కి వాడుకున్నారు. అంత గొప్ప దేశభక్తుడు పేరు కాళ్ళ వద్ద ఉండటాన్ని ఆమె వ్యతిరేకిస్తున్నారు.

దేశభక్తులను మనం గౌరవించకపోయినా పర్లేదు. కనీసం అవమానించకండి. భగత్ సింగ్ పేరును హీరో కాళ్ళ వద్ద వేస్తారా? ఇది అహంకారమా? లేక అమాయకత్వమా? అని పూనమ్ ట్వీట్ చేశారు. ఆమె ట్వీట్ వైరల్ గా మారింది. ఈ వివాదంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పూనమ్ కౌర్ లేని వివాదాన్ని తెరపైకి తెస్తున్నారని కొందరు అంటున్నారు. అది ఉద్దేశపూర్వకంగా చేసిన పని కాదు. రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదంటున్నారు. కొందరేమో ఇలాంటి సున్నితమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని హితవు పలుకుతున్నారు.

ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకుడు. పవన్ కళ్యాణ్ కి జంటగా శ్రీలీల నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. దాదాపు 11 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ కాంబో సెట్ అయ్యింది. 2012 లో వీరి కాంబినేషన్లో తెరకెక్కిన గబ్బర్ సింగ్ బాక్సాఫీస్ రికార్డ్స్ షేక్ చేసింది. హరీష్- పవన్ కలిసి మూవీ చేయాలని ఎప్పటి నుండో ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అది ఎట్టకేలకు సాకారమైంది.

Read Today's Latest Viral news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు