Poonam Kaur On Jagapathi Babu: ఏంటి ఇది?.. మంచిది కాదు.. అంటూ జగపతి బాబుపై ఆశ్చర్యకరమైన పోస్ట్ వేసిన పూనమ్
జగపతిబాబు అంటే ఇష్టపడని వారు సినిమా ఇండస్ట్రీలో కూడా పెద్దగా కనిపివ్వరు. ఒకరి జోలికి పోకుండా తన పనేదో తాను చేసుకుంటూ ముక్కుసూటిగా మాట్లాడే తత్వం జగపతిబాబుది.

Poonam Kaur On Jagapathi Babu: దాదాపుగా తెలుగు వారు ప్రతి ఒక్కరు ఇష్టపడే నటుడు జగపతిబాబు. ఒకప్పుడు ఫ్యామిలీ మాన్ గా ఎంతో పేరు తెచ్చుకున్న జగపతిబాబు ఆ తరువాత కాలంలో విలన్ గా మారి నెగిటివ్ క్యారెక్టర్స్ లో కూడా ప్రస్తుతం రాణిస్తున్నారు.
జగపతిబాబు అంటే ఇష్టపడని వారు సినిమా ఇండస్ట్రీలో కూడా పెద్దగా కనిపివ్వరు. ఒకరి జోలికి పోకుండా తన పనేదో తాను చేసుకుంటూ ముక్కుసూటిగా మాట్లాడే తత్వం జగపతిబాబుది. అందుకే ప్రతి ఒక్కరు ఆయన్ని గౌరవిస్తారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కొద్దిగా కాంట్రవర్సీ కలిగే పోస్టులు వేసే పూనం కౌర్ జగపతిబాబుపై చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి.
జగపతి బాబు తెలుగులోనే కాకుండా ఈ మధ్య పక్క భాషల్లో కూడా ఎక్కువగా కనిపిస్తున్నాడు. తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఆఫర్లు బాగానే వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఈమధ్య జగపతిబాబు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు ద్వారా నెట్టింట్లో కూడా బాగానే ట్రెండ్ అవుతూ ఉన్నారు. ఆయన తన సోషల్ మీడియా అకౌంట్లో బార్బీ లుక్కులో ఫోటోలను షేర్ చేశాడు. దానికి విపరీతమైన స్పందన వచ్చిందట. నెటిజన్లు ఎక్కువగా ఆ ఫోటోల మీద రియాక్ట్ అయ్యారట. లైక్స్ కొట్టారట. తన ఫోటోలన్నింట్లోకెల్లా ఆ బార్బీ లుక్కుకే ఎక్కువ క్రేజ్ వచ్చిందట. అందుకే థాంక్స్ చెబుతూ ఓ ట్వీట్ వేశాడు జగపతిబాబు.
ఇక ఆయన థాంక్స్ అంటూ పెట్టిన ట్వీట్‌కు పూనమ్ కౌర్ రిప్లై ఇచ్చింది. జగ్స్ ఏంటి ఈ టఫ్ కాంపిటీషన్ ఇవ్వడం అందరికీ.. మంచిది కాదు అంటూ ఫన్నీగా కౌంటర్ వేసింది. ఇక ఈ రిప్లై ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
