క్రేజీ ఆఫర్ దక్కించుకున్న పూజా హెగ్డే

హీరోయిన్ పూజా హెగ్డే బంపర్ ఆఫర్ దక్కించుకుంది. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. ‘కబీ ఈద్ కబీ దివాళీ’ మూవీలో సల్మాన్ కు జోడీగా బుట్టబొమ్మ పూజాహెగ్డే ఎంపికైంది. ఈ మేరకు త్వరలోనే ఈ మూవీ ప్రారంభం కానుంది. 2021 ఈద్ కానుకగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది. పూజా హెగ్డే ఇటీవలే అల్లు అర్జున్ తో కలిసి ‘అలవైకుంఠపురములో’ మూవీలో నటించింది. సంక్రాంతి కానుకగా వచ్చిన […]

  • Written By: Neelambaram
  • Published On:
క్రేజీ ఆఫర్ దక్కించుకున్న పూజా హెగ్డే

హీరోయిన్ పూజా హెగ్డే బంపర్ ఆఫర్ దక్కించుకుంది. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. ‘కబీ ఈద్ కబీ దివాళీ’ మూవీలో సల్మాన్ కు జోడీగా బుట్టబొమ్మ పూజాహెగ్డే ఎంపికైంది. ఈ మేరకు త్వరలోనే ఈ మూవీ ప్రారంభం కానుంది. 2021 ఈద్ కానుకగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది.

పూజా హెగ్డే ఇటీవలే అల్లు అర్జున్ తో కలిసి ‘అలవైకుంఠపురములో’ మూవీలో నటించింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ భారీ విజయం సాధించింది. ఓ వైపు మహేష్ బాబు ‘సరిలేరునికెవ్వరు’, మరోవైపు రజనీకాంత్ ‘దర్బార్’ మూవీలను తట్టుకొని భారీ కలెక్షన్లు రాబట్టింది. ఈ మూవీలో పూజా హెగ్డే గ్లామర్ తోపాటు మంచి నటన కనబర్చింది. పూజా హెగ్డే హిట్లతో సంబంధం లేకుండా పెద్ద స్టార్లతో నటిస్తుంది. ఇటీవలే ‘అలవైకుంఠపురములో’ మూవీతో కేరిర్లో బిగ్గెస్ట్ హిట్టు అందుకుంది.

ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ 20వ మూవీలో, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీలో నటిస్తోంది. ఈ అమ్మడికి తెలుగులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగుతోపాటు బాలీవుడ్ పూజా హెగ్డే క్రేజీ ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. అదేవిధంగా బాలీవుడ్ బడా హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ‘రాధే’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీకి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న సంగతి తెల్సిందే. ఈ మూవీ సెట్స్ పై ఉండగా సల్మాన్ ఖాన్ ఫర్హద్ సంజీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘కబీ ఈద్ కబీ దివాళీ’ మూవీలో సల్మాన్ సరసన పూజా హెగ్డే ఎంపికవగా వచ్చే ఏడాది ఈద్ కానుకగా సినిమా రాబోతుందని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు