Kisi Ka Bhai Kisi Ki Jaan Teaser : సినిమా కాంబినేషన్స్ ఎప్పుడు ఎలాగైనా మారతాయి. ఎఫ్ 3లో వెంకీతో స్టెప్ వేసిన పూజా హెగ్డే చెల్లిగా చేస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మూవీ కిసీ కా భాయ్ కిసీ కి జాన్ మూవీలో వెంకీ-పూజా హెగ్డే అన్నా చెల్లెళ్ళ పాత్రలు చేస్తున్నారనే పుకార్లు మొదలయ్యాయి. నేడు విడుదలైన టీజర్ ఈ ఊహాగానాలకు కారణమైంది. కిసీ కా భాయ్ కిసీ కి జాన్ చిత్ర టీజర్ ఆకట్టుకుంది. దాదాపు రెండు నిమిషాల నిడివి ఉన్న టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా మారింది.
దర్శకుడు ఫర్హాన్ సామ్జీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి సల్మాన్ ఖాన్ మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ జోడించి కిసీ కా భాయ్ కిసీ కి జాన్ తెరకెక్కించారు. ఈ టీజర్ మూవీ పై అంచనాలు పెంచేసింది. అదే సమయంలో కొన్ని అనుమానాలు కారణమైంది. ఈ చిత్రంలో వెంకటేష్ కీలక రోల్ చేస్తున్నారు. ఆయన్ని సాంప్రదాయ పంచ కట్టులో చూపించారు. బోనాలు పండగలో వెంకీ, పూజా హెగ్డే కుటుంబ సభ్యులతో పాటు పాల్గొన్నట్లు ఆ సీన్ ఉంది.
ఈ క్రమంలో తెలుగు అమ్మాయి అయిన పూజా హెగ్డేను సల్మాన్ ఖాన్ ప్రేమిస్తారు. పూజా అన్నయ్య వెంకటేష్. కథకు సరిపోయేట్లు తెలుగు హీరో వెంకటేష్ ని కీలక రోల్ కోసం తీసుకున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఈ వాదనలో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాలి. కాగా ఎఫ్ 3 మూవీలో పూజా హెగ్డే ఐటెం సాంగ్ చేశారు. ఆ పాటలో వరుణ్, వెంకీ పూజాతో ఆడిపాడారు. తన ప్రక్కన ఐటెం భామగా చేసిన పూజా హెగ్డే చెల్లెలుగా చేయడం ఊహించని పరిణామం. రంజాన్ కానుకగా కిసీ కా భాయ్ కిసీ కా జాన్ విడుదల కానుంది.
మరోవైపు వెంకీ నేడు సైంధవ్ టైటిల్ తో కొత్త మూవీ ప్రకటించారు. వెంకటేష్ 75వ చిత్రంగా తెరకెక్కుతున్న సైంధవ్ పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో విడుదల కానుంది. హిట్ సిరీస్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకుడు. ఇక పూజా హెగ్డే మహేష్ కి జంటగా ఎస్ఎస్ఎంబి 28 చిత్రంలో నటిస్తున్నారు. మహేష్-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది.