Ponniyin Selvan 2 Movie Review : ‘పొన్నియన్ సెల్వన్ 2 ‘ మూవీ ఫుల్ రివ్యూ

పొన్నియన్ సెల్వన్ మొదటి భాగం ని చూసి నచ్చిన ప్రేక్షకులకు ఈ చిత్రం బాగా కనెక్ట్ అవుతుంది.అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు మణిరత్నం.

  • Written By: NARESH
  • Published On:
Ponniyin Selvan 2 Movie Review : ‘పొన్నియన్ సెల్వన్ 2 ‘ మూవీ ఫుల్ రివ్యూ

నటీనటులు : విక్రమ్ , కార్తీ , జయం రవి , త్రిష , ఐశ్వర్య లెక్ష్మి, ఐశ్వర్య రాయ్,శోభిత దూళిపాళ్ల, ప్రకాష్ రాజ్
సంగీత దర్శకుడు : AR రెహ్మాన్
డైరెక్టర్ : మణిరత్నం
నిర్మాతలు : మణిరత్నం, సుభాస్కరన్

Ponniyin Selvan 2 Movie Review : తమిళనాడు ప్రజలు ఎంతో ఇష్టపడే చోళుల కథని ఆధారంగా తీసుకొని ప్రముఖ రచయితా కల్కి కృష్ణమూర్తి రచించిన నవల ఆధారంగా సౌత్ ఇండియన్ సెన్సషనల్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. తెలుగు మరియు ఇతర బాషలలో ఒక మోస్తారుగా ఆడినా, తమిళ భాషలో మాత్రం ప్రభంజనం సృష్టించింది. తమిళనాడు తో పాటుగా ఓవర్సీస్ కూడా కలిపి ఈ చిత్రానికి సుమారుగా 500 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక నేడు రెండవ భాగం ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది.మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా , కథ ఏమిటి, నటీనటులు ఎలా నటించారు అనేది ఇప్పుడు మనం ఈ రివ్యూ లో చూడబోతున్నాము.

కథ :

చోళయువరాజు అరుణ్ మొళి వర్మ అలియాస్ పొన్నియన్ సెల్వన్ (జయం రవి) సముద్ర నడిబొడ్డున ఓడలో ప్రయాణిస్తూ శత్రుమూకలపై యుద్ధం చేస్తూ సముద్రం లో మునిగిపోతాడు.అప్పుడు అతనిని కాపాడడానికి అరుణ్ మొళి ని కంటికి రెప్పలాగా చూసుకుంటున్న ఒక ముసలావిడ(నందిని పోలికలతో ఉన్న ఐశ్వర్య రాయ్) సముద్రం లోకి దూకుతుంది,అక్కడితో పార్ట్ 1 ముగుస్తుంది.ఇంతకీ ఆ ముసలావిడ ఎవరు,త్వరలో అరుణ్ మొళి పై పొంచిఉన్న పెను ప్రమాదం నుండి ఆమె మళ్ళీ కాపాడుతుందా లేదా?,వీర పాండ్య ని హత్య చేసినందుకు ప్రతీకారం తీసుకోవాలని ఎదురు చూస్తున్న పాండ్యుల లక్ష్యం నెరవేరిందా లేదా?, మరో వైపు సొంత రాజ్యం లో మధురాంతకుడిని రాజుని చెయ్యాలనే ఉద్దేశం తో కొంత మంది డాయుడులు చేస్తున్న కుట్ర రాజకీయాలు సఫలం అయ్యిందా లేదా?, ఇక తనపై మనసుపడిన ఆదిత్య కరికాలుడిని ఎలా అయినా చంపాలనే ఉద్దేశ్యం తో తన కోటలోకి రప్పించుకున్న నందిని ఆదిత్య కరికాలుడుని అంతం చేసిందా? ఇలాంటి ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలంటే వెండితెర మీద చూడాల్సిందే.

విశ్లేషణ :

అరుణ్ మొళి సముద్రం లో మునిగిపోయిన తర్వాత సొంత చోళ రాజ్యం లో చోటు చేసుకున్న సంఘటనలు, చోళ రాజ్యం బలహీన పడితే సామ్రాజ్యం మొత్తాన్ని సమూలంగా నాశనం చెయ్యాలనే కసితో ఎదురు చూస్తున్న పాండ్యుల కుట్రలు కుతంత్రాలను ఈ సినిమాలో చాలా చక్కగా చూపించాడు డైరెక్టర్ మణిరత్నం.మొదటి భాగం లో అప్పుడప్పుడు కనిపిస్తూ వెళ్లిన మందాకినీ ఎవరు అనే విషయం తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తిని కలిగేలా చేసాడు మణిరత్నం.ఇప్పుడు రెండవ భాగం లో ఆమె గురించే ప్రధానం గా చూపించారు.ఇక నందిని మరియు ఆదిత్య కరికాలుడి పాత్రలను ముగించిన తీరు ఆడియన్స్ ని ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది. మొదటి భాగం తో పోలిస్తే రెండవ భాగం లో ఎమోషన్ పాళ్ళు ఎక్కువ ఉండేలా చూసుకున్నాడు మణిరత్నం.కేవలం 150 రోజుల వ్యవధి లో ‘పొన్నియన్ సెల్వన్’ లాంటి కథని రెండు భాగాల్లో ఇంత అద్భుతంగా తీసిన మణిరత్నం ని చూస్తే ఆయన దర్శకత్వ ప్రతిభ ఎలాంటిదో అర్థం అవుతుంది.

ఇక నటీనటుల విషయానికి వస్తే వల్లవరాయుడు గా కార్తీ నటన మొదటి భాగం లో ప్రేక్షకులను ఎంతలా అయితే అలరించిందో, రెండవ భాగం లో కూడా అదే రేంజ్ లో అలరిస్తుంది.ఇక పొన్నియన్ సెల్వన్ గా జయం రవి మరోసారి ఈ పాత్ర ద్వారా తన హుందాతనం ని రాజసం ని చాలా చక్కగా వెండితెర మీద పలికించాడు.ఆదిత్య కరికాలుడిగా నటించిన విక్రమ్ గురించి ప్రత్యేకించి చెప్పేది ఏముంది, ఆయన అద్భుతమైన నటుడనే విషయం అందరికి తెలుసు, ఈ చిత్రం లో కూడా మరోసారి తన నటవిశ్వరూపం ని చూపించాడు. కొన్ని సన్నివేశాల్లో ఏడుపు ని కూడా రప్పించేసాడు.ఇక ఈ చిత్రం లో ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన మరో ముఖ్యమైన పాత్రలు మందాకినీ మరియు నందిని.ఈ రెండు పాత్రలను ఐశ్వర్య రాయ్ పోషించింది, నెగటివ్ మరియు పాజిటివ్ షేడ్స్ తో తన నట విశ్వరూపం ని చూపించేసింది.ఇక AR రెహ్మాన్ అందించిన మ్యూజిక్ ఈ చిత్రానికి ఆయువు పట్టులాగా నిల్చింది.

చివరి మాట :

పొన్నియన్ సెల్వన్ మొదటి భాగం ని చూసి నచ్చిన ప్రేక్షకులకు ఈ చిత్రం బాగా కనెక్ట్ అవుతుంది.అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు మణిరత్నం.

రేటింగ్ : 2.75 /5

Read Today's Latest Pratyekam News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు