Huzurabad and Badvel: హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. హుజురాబాద్, వీణవంక, కమలాపూర్, జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లో పోలింగ్ జరుగుతోంది. 106 గ్రామపంచాయతీల్లోని 306 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. 1715 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. 2,36,283 మంది ఓటర్లుండగా ఇందులో పురుషులు 1,18,720, మహిళలు 1,17,563 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల బరిలో 30 మంది అభ్యర్థులున్నారు. 3865 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.
కడప జిల్లాలోని బద్వేల్ ఉప ఎన్నికకు కూడా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 15 మంది అభ్యర్థులు రంగంలో నిలిచారు. 281 పోలింగ్ కేంద్రాలు ఉండగా 221 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. 3 వేల మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో 2,16,139 ఓటర్లున్నారు. అందులో 1,07,340 మంది మహిళా ఓటర్లు, 1,08,799 మంది పురుష ఓటర్లున్నారు. 917 పోస్టల్ బ్యాలెట్ ఓట్లున్నాయి.
ఓటు వేయడానివచ్చే ఓటర్లు నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. మాస్కులు ధరించాలని చెబుతున్నారు. భౌతిక దూరం పాటించాలని చెప్పారు. కరోనా బాధితులకు సాయంత్రం 6 గంటల వరకు అవకాశం కల్పించారు. ఓటు వేసేందుకు వచ్చే వారు విధిగా ఓటరు స్లిప్ తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు వెంట తీసుకురావాలని చెబుతున్నారు.
Also Read: Modi PM: బీజేపీ సంచలన ప్రకటన : 2024లోనూ మోడీనే ప్రధాని.. వర్కవుట్ అవుతుందా?
పోలింగ్ సరళిని ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు పటిష్టం చేశారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎక్కడ కూడా ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలగకుండా అధికారులు ఫోకస్ పెట్టారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
Also Read: Crime News: మిస్ తెలంగాణ.. రెండోసారి సూసైడ్.. కారణమిదే