AP Politics: ఏపీలో పొలిటికల్ హీట్.. చంద్రబాబు కేసు విచారణలు.. అసెంబ్లీ సమావేశాలు

స్కిల్ డెవలప్మెంట్ స్కాం విచారణలో చంద్రబాబును ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని సిఐడి కోరింది. కేసులో అవినీతి జరిగినట్లు నిర్ధారణ అయిందని.. చంద్రబాబు నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని సిఐడి వాదనలు వినిపించింది.

  • Written By: Dharma
  • Published On:
AP Politics: ఏపీలో పొలిటికల్ హీట్.. చంద్రబాబు కేసు విచారణలు.. అసెంబ్లీ సమావేశాలు

AP Politics: ఏపీలో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ఒక వైపు చంద్రబాబు అరెస్ట్, రిమాండ్, బెయిల్ పిటిషన్ల విచారణ కొనసాగుతోంది. మరోవైపు మంత్రివర్గ సమావేశం, అసెంబ్లీ సమావేశాలు హీట్ పుట్టించనున్నాయి. చంద్రబాబు రిమాండ్ సమయం ముగుస్తున్న వేళ ఈరోజు చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై నిర్ణయం వెలువడనుంది. సిఐడి చంద్రబాబును ఐదు రోజులు పాటు కస్టడీ కోరింది. ఈ పిటిషన్ పైన కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. అటు హైకోర్టులో క్వాష్ పిటిషన్ పైన తీర్పు రిజర్వ్ అయ్యింది. ఇప్పుడు ఏసీబీ కోర్టు తీర్పు పై ఉత్కంఠ కొనసాగుతోంది.

స్కిల్ డెవలప్మెంట్ స్కాం విచారణలో చంద్రబాబును ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని సిఐడి కోరింది. కేసులో అవినీతి జరిగినట్లు నిర్ధారణ అయిందని.. చంద్రబాబు నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని సిఐడి వాదనలు వినిపించింది. కేసుతో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిని మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని.. చంద్రబాబును కస్టడీకి ఇస్తే మరిన్ని వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఏఏజి తన వాదనలు వినిపించారు.అయితే దీనిపై చంద్రబాబు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్కిల్స్ స్కామ్ లో చంద్రబాబు అవినీతి చేసినట్లు ఎక్కడ ఆధారాలు లేవని.. ఆయన అరెస్టు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందన్నారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ భద్రత ఉన్న వ్యక్తిని విచారణ పేరుతో ఇబ్బందులు పెట్టడం తగదన్నారు. అటువంటి వ్యక్తిని కస్టడీ కోరడం ఏమిటని ప్రశ్నించారు. ఇది రాజకీయ కుట్రతోనే జరిగిందని చెప్పుకొచ్చారు. ఇరువర్గాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు కస్టడీ పిటిషన్ పై తీర్పును గురువారం నాటికి వాయిదా వేసింది.

గత 12 రోజులుగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన రిమాండ్ శుక్రవారంతో పూర్తి కానుంది. మరోవైపు క్వాష్ పిటిషన్ పై తీర్పును రేపు హైకోర్టు వెల్లడించనుంది. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు హీట్ పుట్టించనున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సైతం అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. రాజీనామా ఆస్త్రాన్ని ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు గత నాలుగున్నర ఏళ్లుగా చేసిన అభివృద్ధిపై జగన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారని తెలుస్తోంది. చంద్రబాబు అరెస్టుపై సైతం సుదీర్ఘంగా మాట్లాడే అవకాశం ఉంది. దీనిపై టిడిపి సభ్యులకు కూడా నిరసన తెలిపేందుకు కసరత్తు చేస్తున్నారు. దీంతో ఏపీలో పొలిటికల్ హీట్ మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Read Today's Latest Ap politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు