Polimera 2 Twitter Review: పొలిమేర 2 ట్విట్టర్ రివ్యూ: సినిమాలో అవి హైలెట్… ఆడియన్స్ నుండి ఊహించని రెస్పాన్స్!
మా ఊరి పొలిమేర 2 ఖచ్చితంగా థ్రిల్ చేస్తుందని సత్యం రాజేష్ ప్రమోషన్స్ లో బల్లగుద్ది చెప్పాడు. అలాగే పార్ట్ 1 సక్సెస్ నేపథ్యంలో సీక్వెల్ పై ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ఏర్పడింది.

Polimera 2 Twitter Review: సత్యం రాజేష్ హీరోగా దర్శకుడు డాక్టర్ అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన చిత్రం మా ఊరి పొలిమేర 2. ఈ చిత్రం 2021లో అదే టైటిల్ తో వచ్చిన మూవీకి సీక్వెల్. బాలాదిత్య, గెటప్ శ్రీను, కామాక్షి భాస్కర్ల కీలక రోల్స్ చేశారు. మా ఊరి పొలిమేర 2 నేడు విడుదలైంది. సోషల్ మీడియా టాక్ ఏంటో చూద్దాం…
మా ఊరి పొలిమేర 2 ఖచ్చితంగా థ్రిల్ చేస్తుందని సత్యం రాజేష్ ప్రమోషన్స్ లో బల్లగుద్ది చెప్పాడు. అలాగే పార్ట్ 1 సక్సెస్ నేపథ్యంలో సీక్వెల్ పై ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ఏర్పడింది. మరి ఆడియన్స్ ని మూవీ థ్రిల్ చేసిందా అంటే… అవుననే మాట వినిపిస్తోంది. మెజారిటీ ఆడియన్స్ మా ఊరి పొలిమేర 2 చిత్రం పట్ల పాజిటివ్ గా స్పందిస్తున్నారు. పార్ట్ 1లో సత్యం రాజేష్ మరణించాడని కుటుంబ సభ్యులు అనుకుంటారు.
అయితే నచ్చిన అమ్మాయితో అతడు ఊరు వదిలి పోయినట్టు చూపించి థ్రిల్ చేశారు. అక్కడి నుండి పార్ట్ 2 మొదలవుతుంది. ఊరి పొలిమేరలో గల గుడి చుట్టూ ఈ చిత్ర కథ నడుస్తుంది. మూవీ చూసిన ఆడియన్స్ ట్వీట్టర్ వేదికగా తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. ఓ నెటిజెన్… నరేషన్, డైరెక్షన్ చాలా బాగున్నాయి. బీజీఎమ్ మెప్పించిందని అభిప్రాయపడ్డాడు. మరొక నెటిజెన్… అద్భుతమైన బీజీఎంతో ఫస్ట్ హాఫ్ బాగుంది. పార్ట్ 1 అండ్ 2 లను లింక్ చేస్తూ తెరకెక్కించిన సన్నివేశాలు బాగున్నాయని కామెంట్ చేశాడు.
సెకండ్ హాఫ్ చాలా బాగుంది. కథలో మలుపులు అలరించాయ. క్లైమాక్స్ స్లోగా ఉంది. అయితే చివర్లో వచ్చే ట్విస్ట్ బాగుంది, అని ట్వీట్ చేశాడు. ఆడియన్స్ కామెంట్స్ చూస్తే చేతబడులు, క్షుద్రపూజలు కాన్సెప్ట్ తో తెరకెక్కిన మా ఊరి పొలిమేర 2 ప్రేక్షకులను థ్రిల్ చేయడంలో చాలా వరకు సక్సెస్ అయ్యింది. ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి అనుభూతి పంచుతుంది అనడంలో సందేహం లేదు. శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి గ్యానీ మ్యూజిక్ అందించారు.
Superb narration and excellent direction and the BGM was just lit🔥#Polimera2
— Naveen (@FnkYBY1) November 2, 2023
Good First Half with Excellent BGM
Part 1 & part 2 linkup scenes are goodNo boring scenes 👌👌#Polimera2 https://t.co/Wsltrr1NnN pic.twitter.com/1WzqW8aOES
— Shiva Akunuri (@AkunuriShivaa) November 2, 2023
Excellent 2nd half with Very Good TWISTS🔥🔥🔥
Slow paced Climax with good Twist 👍
Worth watching & Waiting for Part 3#Polimera2— Shiva Akunuri (@AkunuriShivaa) November 2, 2023
https://twitter.com/_palnadu_/status/1720211053995249984?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1720211053995249984%7Ctwgr%5Eff890ab7f7f703fd588c474bf6d8bfcec5f364a8%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.filmibeat.com%2Fnews%2Fsatyam-rajesh-starrer-maa-oori-polimera-2-movie-twitter-review-127177.html
Best movie in recent times
Mind blowing twists and turns🤯🔥
crazy screenplay💥
Must Watch💯#Polimera2 https://t.co/Auc2dhGe7D— Sumanth👻 (@SumanthCh08) November 3, 2023
