Police Attacked Revanth Reddy Driver: కారు డోరు తెరిచి.. బూతులు తిట్టి: రేవంత్ రెడ్డి డ్రైవర్ పై పోలీసుల దాష్టీకం
సోమవారం హైదరాబాదులోని సరూర్నగర్ లో ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో యువ సంఘర్షణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో స్పష్టం చేశారు.

Police Attacked Revanth Reddy Driver: పోలీసులంటే శాంతి భద్రతలు కాపాడేవారు. అరాచక శక్తుల నుంచి ప్రజలకు భద్రత కల్పించేవారు. రాను రాను తెలంగాణలో పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారిపోతున్నారు.. అనధికారిక కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు కూడా తమకు అనుకూలమైన పోలీసులకు పోస్టింగులు ఇవ్వడంతో వారు ప్రతిపక్ష పార్టీల నాయకుల పై రెచ్చిపోతున్నారు. దాష్టీకం ప్రదర్శిస్తున్నారు. బాధితుల వైపు ఉండాల్సిన పోలీసులు అధికార పార్టీ వైపు ఉండి న్యాయాన్ని నగుబాటు చేస్తున్నారు.
ఎంపీ డ్రైవర్ అని కూడా చూడలేదు
సోమవారం హైదరాబాదులోని సరూర్నగర్ లో ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో యువ సంఘర్షణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో స్పష్టం చేశారు. ఊహించిన దానికంటే జనం ఎక్కువ రావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉబ్బి తబ్బిబవుతున్నారు.. ఒకవైపు సీనియర్లు సహకరించకపోయినప్పటికీ రేవంత్ రెడ్డి అన్ని తానై పార్టీని నడిపిస్తున్నారు. కాదు ఆ మధ్య రాహుల్ గాంధీతో వరంగల్లో భారీ ఎత్తున సభ నిర్వహించి తనకు తానే సాటి అనిపించుకున్నారు. తాజాగా ప్రియాంక గాంధీతో భారీ ఎత్తున సభ నిర్వహించి మరొక్కసారి తాను కాంగ్రెస్ పార్టీలో ఎంత ప్రత్యేకమో నిరూపించుకున్నారు.. అయితే ఇదంతా జరుగుతుండగానే పోలీసులు రేవంత్ రెడ్డి డ్రైవర్ పై దాడి చేశారు.. కారు డోర్ తీసి అతడిని బయటికి లాగి పిడిగుద్దులు గుద్దారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్నప్పటికీ పోలీసులు దాడి చేస్తూనే ఉన్నారు.
ఎన్నాళ్లు ఈ వత్తాసు
అయితే పోలీసులు తనపై దాడి మాత్రమే కాదు బండ బూతులు తిట్టారని రేవంత్ రెడ్డి డ్రైవర్ చెబుతున్నాడు. పోలీసులు దాడి చేసిన సమయంలో రేవంత్ రెడ్డి కారులో లేరు. రేవంత్ రెడ్డి సభా వేదిక పైకి వెళ్లిన తర్వాత పోలీసులకు డ్రైవర్ కు మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. వాస్తవానికి పోలీసులు అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతున్నారు. ఎంపీ డ్రైవర్ మీద మాత్రమే కాదు గతంలో వైఎస్ షర్మిల పోలీసులపై చేయి చేసుకున్న క్రమంలో ఆమె కారు డ్రైవర్ ను సంబంధిత ఎస్సై బయటకు లాగారు. బెదిరించే ప్రయత్నం చేశారు. మొన్న జూబ్లీహిల్స్ లో ఒక బాలుడు నీటి కుంటలో పడి చనిపోయినప్పుడు స్థానిక సీఐ బాధితులను బెదిరించారు. తీన్మార్ మల్లన్న ను అరెస్టు చేసే సమయంలోనూ పోలీసులు అతిగా ప్రవర్తించారు. మొన్నటికి మొన్న బండి సంజయ్ ని అరెస్టు చేసే విషయంలోనూ ఇదే తీరుగా వ్యవహరించారు. కేంద్ర హోం శాఖ మంత్రి ఆ సమయానికి ఫోన్ చేయకపోతే తనను చంపేసేవారని బండి సంజయ్ చెప్పడం పోలీసులు అనుసరిస్తున్న దమన నీతికి అద్దం పడుతున్నది. అయితే పోలీసులు కూడా అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ల వల్లే ఇలా చేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఏమైనప్పటికీ రేవంత్ రెడ్డి డ్రైవర్ పై పోలీసులు దాడి చేయడం పట్ల ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.
Police Slaps TPCC Chief Revanth Reddy’s Car Driver pic.twitter.com/RtaPI0Mjq4
— Indian News Network (@INNChannelNews) May 8, 2023
