PM Modi Warangal Tour: అవినీతి ఢిల్లీకి పాకింది..కవిత పై మోదీ పరోక్ష విమర్శలు
దక్షిణ మధ్య రైల్వేలో తెలంగాణ అత్యంత కీలకంగా ఉందని, దీనిని మరింత అభివృద్ధి చేసేందుకు రైల్వే ట్రాక్ ల కనెక్టివిటీ పెంచుతున్నామని మోడీ ప్రకటించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తుందని, ఇందులో మాకు ఎటువంటి వివక్ష లేదని మోడీ అన్నారు.

PM Modi Warangal Tour: వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ లో పర్యటిస్తున్నారు. ఢిల్లీ నుంచి ఆర్మీ ప్రత్యేక విమానం ద్వారా మామునూరు ఎయిర్పోర్ట్ కు వచ్చిన మోడీ.. భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. తర్వాత హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభకు హాజరయ్యారు. ఆయన తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. వృద్ధులను తెలంగాణ ముందుంది అన్నారు. దేశాభివృద్ధిలో తెలంగాణ ప్రజల కీలకపాత్ర పోషిస్తున్నారని కితాబిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఆరువేల కోట్లతో జాతీయ రహదారులు నిర్మిస్తున్నామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి సంబంధించి ఆర్థిక చోదక శక్తిగా మారుతోందని ప్రకటించారు. సరళీకృత ఆర్థిక విధానాల వల్ల తెలంగాణ మరింత బలంగా ముందడుగు వేస్తోందని ఈ సందర్భంగా ఆయన వివరించారు.
దక్షిణ మధ్య రైల్వేలో తెలంగాణ అత్యంత కీలకంగా ఉందని, దీనిని మరింత అభివృద్ధి చేసేందుకు రైల్వే ట్రాక్ ల కనెక్టివిటీ పెంచుతున్నామని మోడీ ప్రకటించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తుందని, ఇందులో మాకు ఎటువంటి వివక్ష లేదని మోడీ అన్నారు. ఇదే సందర్భంలో కెసిఆర్ ప్రభుత్వం పై నిప్పులు చెరి గారు. తెలంగాణ ప్రజలు తమ మేధస్సుతో దేశంలో అత్యంత ప్రతిభావంతులుగా వెలుగొందుతుంటే.. ఇక్కడి పాలకులు మాత్రం అవినీతిలో ఢిల్లీ స్థాయి వరకు వచ్చారని పరోక్షంగా కవితను ఉద్దేశించి మోడీ వ్యాఖ్యలు చేశారు. ఎక్కడైనా అభివృద్ధి కోసం రాష్ట్రాలు కలిసి పనిచేస్తాయని, కానీ మద్యం ఆదాయం కోసం, అందులో అక్రమాలకు పాల్పడి ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ఢిల్లీ, తెలంగాణ కలిసి పనిచేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఇలాంటి అవినీతి కోసమేనా తెలంగాణ కోసం యువత బలిదానాలు చేసింది అని మోడీ ప్రశ్నించారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించిందని.. వచ్చే రోజుల్లో అసలు సినిమా కనిపిస్తుందని ప్రధానమంత్రి మోడీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీల ఉనికి లేకుండా చేస్తామని ఆయన ప్రకటించారు. తెలంగాణలో కుటుంబ పార్టీలు అవినీతికి కొమ్ముకాస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. కెసిఆర్ సర్కారు అవినీతిని పెంచి పోషిస్తుందని అన్నారు. అందుకే అది దేశా నుండి ప్రతిపక్ష పార్టీలకు ఫైనాన్స్ చేస్తోందని దుయ్య పట్టారు. తొమ్మిది సంవత్సరాలలో కెసిఆర్ ప్రభుత్వం ఏం చేసిందో పాలని మోదీ ప్రశ్నించారు. యువతను, సబ్బండ వర్ణాలను కెసిఆర్ ప్రభుత్వం మోసం చేసిందని మోదీ వ్యాఖ్యానించారు. మోదీ భారత రాష్ట్ర సమితి పై విమర్శలు చేసిన నేపథ్యంలో భారత జనతా పార్టీ క్యాడర్లో ఒక్కసారిగా ఉత్సాహం వచ్చింది.
