కియో వివాదంపై ప్రధాని ఆరా… ఇరకాటంలో జగన్

అధికారంలో ఉన్న పెద్దల నుండి ఎదురవుతున్న వత్తిడులు, వేధింపుల కారణంగానే అనంతపూర్ జిల్లాలోని తమ కార్ల ప్లాంట్ విషయంలో ప్రపంచంలోని ఐదవ పెద్ద కార్ల ఉత్పత్తి దారులైన కియో యాజమాన్యం సంకేతం ఇవ్వడం గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించడంతో ముఖ్యమంత్రి వైఎస్ వై ఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇరకాట పరిస్థితి ఎదుర్కొన్నట్లు తెలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఒక వంక విదేశీ పెట్టుబడుల కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంటే, వచ్చిన పెట్టుబడులు తిరిగి వెళ్లే పరిష్టితి […]

  • Written By: Neelambaram
  • Published On:
కియో వివాదంపై ప్రధాని ఆరా… ఇరకాటంలో జగన్

అధికారంలో ఉన్న పెద్దల నుండి ఎదురవుతున్న వత్తిడులు, వేధింపుల కారణంగానే అనంతపూర్ జిల్లాలోని తమ కార్ల ప్లాంట్ విషయంలో ప్రపంచంలోని ఐదవ పెద్ద కార్ల ఉత్పత్తి దారులైన కియో యాజమాన్యం సంకేతం ఇవ్వడం గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించడంతో ముఖ్యమంత్రి వైఎస్ వై ఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇరకాట పరిస్థితి ఎదుర్కొన్నట్లు తెలుస్తున్నది.

కేంద్ర ప్రభుత్వం ఒక వంక విదేశీ పెట్టుబడుల కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంటే, వచ్చిన పెట్టుబడులు తిరిగి వెళ్లే పరిష్టితి కల్పించవద్దని బుధవారం కలసినప్పుడు ప్రధాని సున్నితంగా హితవు చెప్పిన్నట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు వెనుకాడుతున్నారని.. దీని ప్రభావం దేశవ్యాప్తంగా పెట్టుబడుల వాతావరణంపై ఉంటుందని ఈ సందర్భంగా ప్రధాని ఒక విధంగా హెచ్చరిక చేశారు.

విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) పునఃసమీక్ష, కేంద్రం ఉత్తర్వులిచ్చినా.. హైకోర్టు ఆదేశించినా విద్యుదుత్పత్తి సంస్థలకు బకాయిలు చెల్లించకపోవడం కూడా వారి చర్చలలో ప్రస్తావనకు వచ్చిన్నట్లు తెలుస్తున్నది. లాగే ఉద్యోగాల్లో స్థానికులకే 75 శాతం రిజర్వేషన్లపై కూడా పారిశ్రామికవేత్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తున్నది.

మూడు రాజధానులు, రాష్ట్ర విభజన సమస్యలు, పోలవరం నిధులు, శాసనమండలి రద్దు తీర్మానంతో వంటి రాష్ట్ర ప్రభుత్వానికి కీలకమైన పలు అంశాలను జగన్ ప్రస్తావించినా ప్రధాని ఎటువంటి భరోసా ఇవ్వలేదని చెబుతున్నారు. ఆయన ప్రస్తావించిన ఏ అంశం కురించి కూడా ప్రధాని నుండి స్పందన లేకపోవడంతో జగన్ ఒకింత నిరుత్సాహానికి గురయిన్నట్లు వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఆయా అంశాలను హోమ్ మంత్రి అమిత్ షాను కలసి చర్చించామని సూచించారని అంటున్నారు. అందుకనే అమిత్ షా ను కలవడం కోసం తిరిగి శుక్రవారం ఆయన ఢిల్లీకి వెడుతున్నారు.

సంబంధిత వార్తలు