OK Telugu

- Politics, Movies, AP, Telangana

  • హోం
  • రాజకీయాలు
    • తెలంగాణ
    • ఆంధ్రప్రదేశ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సంపాదకీయం
  • సినిమా
    • బిగ్ బాస్ 5 అప్‌డేట్స్
    • సినిమా రివ్యూస్
    • అప్ కమింగ్ మూవీస్
    • అప్పటి ముచ్చట్లు
    • స్టార్ సీక్రెట్స్
  • బ్రేకింగ్ న్యూస్
  • లైఫ్‌స్టైల్
  • విద్య / ఉద్యోగాలు
  • 2021 రౌండ్ అప్
  • English
You are here: Home / ప్రత్యేకం / PK TRS: పీకే సర్వే లీక్.. టీఆర్ఎస్ పని అయిపోయినట్టేనా?

PK TRS: పీకే సర్వే లీక్.. టీఆర్ఎస్ పని అయిపోయినట్టేనా?

Published by Naresh On Thursday, 23 June 2022, 10:16

PK TRS: తెలంగాణ సాధించిన పార్టీగా రెండు సార్లు అధికారం దక్కించుకున్న టీఆర్ఎస్ కు ముచ్చటగా మూడోసారి గెలుపు అంత ఈజీ కాదని తెలుస్తోంది. అందుకే దేశంలోనే ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను ఏరికోరి తెచ్చుకుంది. ఆయన సూచనలు, సర్వేల ప్రకారం ముందుకెళుతోంది. దేశంలోనే అపరచాణఖ్యుడు లాంటి కేసీఆర్ తన ఐడియాలను పక్కనపెట్టి మరీ ప్రశాంత్ కిషోర్ ను తన ఆస్థాన సలహాదారుడిగా పెట్టుకోవడం విశేషం.

ఈ క్రమంలోనే వచ్చేసారి సగానికి పైగా ఎమ్మెల్యేలను మార్చేయాలని పీకే సలహా ఇచ్చినట్టు సమాచారం. తన సర్వేలో 40 మందికి పైగా ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని.. వారిని మార్చాల్సిందేనని నివేదిక ఇచ్చినట్టు టీఆర్ఎస్ లో ప్రచారం సాగుతోంది. అయితే దీన్ని వ్యూహాత్మకంగా టీఆర్ఎస్ అధిష్టానం పీకే సర్వేను మీడియా ద్వారా లీక్ చేసినట్టు తెలుస్తోంది. తమ చేతికి మట్టి అంటకుండా మీడియా ద్వారా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను ఎగురగొట్టే ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది.

తెలంగాణలో పరిస్థితులపై పీకే సర్వే చేసి ఇచ్చిన నివేదికను టీఆర్ఎస్ కావాలనే లీక్ చేసినట్టు తెలిసింది. ఇందులో ముఖ్యంగా రెండు కారణాలున్నాయి. ఒకటి వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను ఇప్పటి నుంచే సాగనంపే ప్రక్రియతోపాటు.. రాష్ట్రంలో టీఆర్ఎస్ దే అధికారం అని.. రెండో స్థానం కాంగ్రెస్ దని.. అసలు బీజేపీ పోటీయే కాదని ప్రజల్లోకి తీసుకెళ్లే ఎత్తుగడ వేసింది.

-అసలు పీకే సర్వేలో ఏముంది?
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ కు కాస్త సీట్లు తగ్గినా ఎంఐఎంతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. కనీసం 50 సీట్లు గ్యారెంటీ అని మరోసారి టీఆర్ఎస్ దే అధికారం అని పీకే సర్వేలో తేలిందట.. ఇక రెండోస్థానంలో కాంగ్రెస్ నిలుస్తుందని పీకే తేల్చాడు. ఇక బీజేపీ హడావుడి పెద్దగా ఉన్నా రాష్ట్రమంతా ఆ పార్టీకి బలం లేదు. అన్ని నియోజకవర్గాల్లో పోటీచేసేంత నాయకులు లేరని.. ఆ పార్టీ సీట్లు 20లోపే వస్తాయని తేలింది.

-నెపం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపైకి..
తెలంగాణ ప్రభుత్వంపై వ్యతిరేకతన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపైకి నెట్టేసి వారికి వచ్చేసారి టికెట్లు నిరాకరించి కొత్త వారికి ఇచ్చి గెలిపించుకోవాలని టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఆ ప్రకారం పీకే సర్వేలోనూ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని.. వారిని మార్చాల్సిన అవసరం ఉందని లీకులు ఇస్తోంది. ఇప్పటికే వారిని ప్రిపేర్ చేస్తోంది. ఆయా సిట్టింగ్ లకు వచ్చేసారి సీట్లు ఉండవని ముందుగానే మీడియా ద్వారా లీకులు ఇస్తూ సంకేతాలు పంపిస్తున్నారు.

-ప్రభుత్వంపై వ్యతిరేకత..
ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు, వృద్ధులు, వికలాంగులకు పెన్షన్ల విషయంలో చాలా ఆలస్యం అవుతోంది. వారంతా అసంతృప్తిగా ఉన్నారు. ఇక ఉద్యోగాలు ఇవ్వక నిరుద్యోగులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఒక్క రైతులు తప్పితే తెలంగాణ సమాజంలో ఎవరూ ఆనందంగా లేరు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో జనాలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఇంతటి వ్యతిరేకతలో ఎలా గెలవాలన్నది పీకే రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. కానీ ముచ్చటగా మూడోసారి టీఆర్ఎస్ గెలుపు పీకే వచ్చినా.. ఇంకెవరు వచ్చినా అంత ఈజీ మాత్రం కాదన్నది వాస్తవం. మరి గులాబీ దళపతి కేసీఆర్ ఈ విషయంలో ఎలాంటి ముందుకెళుతాడు? ఎలాంటి సంస్కరణలు చేస్తాడన్నది వేచిచూడాలి.

లైఫ్ స్టైల్

Truths In The World: ప్రపంచంలో సత్యాలు.. మన కళ్ల ముందే జరుగుతున్న మనం గుర్తించని నిజాలు!

Team India Ready For first T20 Against England: ఇంగ్లండ్ తో తొలి టీ20 పోరుకు టీమిండియా సిద్ధం.. ఇరు జట్ల బలాబలాలివీ!

Rainy Season: వర్షాకాలంలో ఆ నాలుగు కూరగాయలు తినకూడదా?

TVS Ronin 2022: గంటకు 120 కి.మీ.ల వేగం..అడ్వాన్స్ ఫీచర్స్: మార్కెట్లోకి TVS రోనిన్..

MS Dhoni Love Story: ధోని-సాక్షి మధ్య ప్రేమ ఎలా పుట్టిందో తెలుసా?

Electric Vehicles: ‘ఈ’-బండి జోరు పెరుగుతోంది

Virat Kohli: విరాట్ కోహ్లిపై వేటు వేసేందుకే ఈ షాకింగ్ నిర్ణయమా?

India vs England 5th Test: ఇంగ్లండ్ పై టీం ఇండియా ఓటమికి కారణాలు ఇవే

మరిన్ని చదవండి ...

Advertisements

అప్పటి ముచ్చట్లు

Renu Desai: రేణుదేశాయ్ ను పిలిస్తే.. వచ్చి క‌మిట్‌మెంట్ గురించి చెప్పింది

NTR-ANR: ఇంత దిగజారుడు కథను ఎన్టీఆర్ – ఏఎన్నార్ ఎలా ఒప్పుకున్నారు ?

S. V. Ranga Rao Rare Photo: ‘ఎస్వీఆర్’ చిన్ననాటి ఫోటో.. వావ్ అచ్చం ‘విజయ్ దేవరకొండ’లా ఉన్నాడు

Carzy Update: ‘సిగ్గు ఉంటే సినిమాల్లోకి ఎందుకు వస్తాను ?.., నీ అంతు తేలుస్తా ఈ రోజు !

Kannamba Biography: నటశిరోమణి ‘కన్నాంబ’ బయోగ్రఫీ !

మరిన్ని చదవండి ...

వైరల్ అడ్డా

Truths In The World: ప్రపంచంలో సత్యాలు.. మన కళ్ల ముందే జరుగుతున్న మనం గుర్తించని నిజాలు!

Naga Chaitanya Samantha: ప్రేమించడం నేర్పించింది నువ్వే.. నాగచైతన్య ఎమోషనల్ పోస్ట్ వైరల్

Gorantla Rajendraprasad Away: చిత్రసీమలో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత!

Alia Bhatt: ఫస్ట్ నైట్ పై ఓపెన్ గా చెప్పేసిన ఆలియా భట్.. వైరల్

A period of decay: కుళ్ళిపోవడానికి ఎవరికి  ఎంత సమయం పడుతుంది?

Acharya Koratala Shiva: ‘ఆచార్య’తో నష్టపోయిన వారికి ఆస్తులమ్మి చెల్లిస్తున్న కొరటాల శివ!?

మరిన్ని చదవండి ...

గాసిప్

Naga Chaitanya Samantha: ప్రేమించడం నేర్పించింది నువ్వే.. నాగచైతన్య ఎమోషనల్ పోస్ట్ వైరల్

Acharya Koratala Shiva: ‘ఆచార్య’తో నష్టపోయిన వారికి ఆస్తులమ్మి చెల్లిస్తున్న కొరటాల శివ!?

Rajamouli Mahesh Babu: మహేష్ బాబు విషయంలో రాజమౌళి తప్పు చేస్తున్నాడా?

Viral: విడాకులకు సిద్ధమైన ముగ్గురు ప్రముఖ హీరోలు!?

BJP Venkaiah Naidu: వెంకయ్య కాకపోయే.. ఆ మీడియా, ఆ సామాజికవర్గం గగ్గోలు

మరిన్ని చదవండి ...

ప్రవాస భారతీయులు

TANA: తానా ఆధ్వర్యంలో అమెరికాలో మొట్టమొదటి ‘ఉచిత కంటి వైద్య శిబిరం’

Viral: లాటరీ ఇలా తగిలితే దరిద్రం పోతుంది.. ఇతడు ఎంత గెలిచాడో తెలుసా?

Chai Pani: అమెరికాలోనూ భారతీయుల రుచులదే హవా.. ఉత్తమ రెస్టారెంట్ గా ‘చాయ్ పానీ’

Saptakhanda Awadhana Sahitya Jhari ‘ అంగరంగంగా వైభవంగా ‘సప్త ఖండ అవధాన సాహితీ ఝరి’

TANA ‘Amma Nanna Sambaralu’ : ‘అమ్మానాన్న’లపై ప్రేమను చాటిన ‘తానా’

మరిన్ని చదవండి ...

Copyright © 2019-2021 · Ok Telugu


Follow us on


OKtelugu.com is an online media owned by Indus media partner LLC.
OKTelugu provides latest Telugu Live News, Political News, Movie News and Viral News for AP & Telangana Audience.
About Us | Disclaimer | Contact Us | Feedback & Grievance | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap