Prabhas – Anushka Shetty: పిక్ ఆఫ్ ది డే : అంత దూరం పోయినా ప్రభాస్ వదలని అనుష్క.. వైరల్ ఫొటో

Prabhas – Anushka Shetty: టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని జంటలు హిట్ ఫెయిర్ గా ఉంటాయి. వీళ్లు కలిసి ఏ సినిమాలో నటించినా అవి సక్సెస్ అవుతాయనే నమ్మకం ఉంటుంది. ఒకప్పుడు ఏఎన్నార్-సావిత్రి, చిరంజీవి- విజయశాంతి, వెంకటేశ్- సౌందర్యలు కలిసి నటించిన సినిమాలు దాదాపుగా హిట్టు కొట్టినవే. వీరి నటన చూసి వీరి మధ్య ఏదైనా ఉందా? అనే చర్చ కూడా సాగింది. నేటీ కాలంలోనూ మరో జంట ప్రేక్షకులను అలరిస్తోంది. అదే ప్రభాస్-అనుష్క కపుల్స్. ప్రభాస్, […]

  • Written By: SS
  • Published On:
Prabhas – Anushka Shetty:  పిక్ ఆఫ్ ది డే : అంత దూరం పోయినా ప్రభాస్ వదలని అనుష్క.. వైరల్ ఫొటో

Prabhas – Anushka Shetty: టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని జంటలు హిట్ ఫెయిర్ గా ఉంటాయి. వీళ్లు కలిసి ఏ సినిమాలో నటించినా అవి సక్సెస్ అవుతాయనే నమ్మకం ఉంటుంది. ఒకప్పుడు ఏఎన్నార్-సావిత్రి, చిరంజీవి- విజయశాంతి, వెంకటేశ్- సౌందర్యలు కలిసి నటించిన సినిమాలు దాదాపుగా హిట్టు కొట్టినవే. వీరి నటన చూసి వీరి మధ్య ఏదైనా ఉందా? అనే చర్చ కూడా సాగింది. నేటీ కాలంలోనూ మరో జంట ప్రేక్షకులను అలరిస్తోంది. అదే ప్రభాస్-అనుష్క కపుల్స్. ప్రభాస్, అనుష్క కలిసి మొదటిసారిగా ‘బిల్లా’ సినిమాలో కనిపించారు. ఆ తరువాత మిర్చి లో నటించి ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో వీరిని చూసి జక్కన్న బాహుబలి సినిమాలో మెయిన్ రోల్స్ ఇచ్చారు. అప్పటి నుంచి ప్రభాస్- అనుష్కలకు మించిన జంట మరొకటి వస్తుందా? అనేవరకు చర్చ సాగింది.

బాహుబలి సినిమాల తరువాత ప్రభాస్ పలు సినిమాల్లో నటిస్తున్నారు. కానీ అనుష్క మాత్రం ఒకటి, రెండు సినిమాలు మాత్రమే చేసింది. ప్రస్తుతం ‘మిస్టర్స్ షెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ మూవీతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా నిర్మాణం చాలా ఆలస్యమవవుతున్నా అనుష్క మాత్రం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. ఈ మూవీకి సంబంధించి అనుష్క కుక్ చేస్తున్న పిక్ బయటకు వచ్చి ఆకట్టుకుంది. ఇందులో నవీన్ పోలిశెట్టి ఆమెతో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ వేస్తున్నారు.

అటు ప్రభాస్ సలార్ తో బిజీగా ఉన్నారు. వీటితో పాటు మరికొన్ని సినిమాలకు సైన్ చేసినందున ఒకేసారి రెండు, మూడు సినిమాలకు ప్లాన్ చేశారు. అయితే ఇటీవల ఆయన అనారోగ్యం కావడంతో విదేశాలకు వెళ్లారు. కొందరు ప్రభాస్ కు ఏదో అయిందన్న వార్తలు రావడంతో ఆయన సన్నిహితులు స్పందించారు. రెగ్యులర్ చెకప్ లో భాగంగానే ప్రభాస్ విదేశాలకు వెళ్లారని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూల్ అయ్యారు.

Prabhas - Anushka Shetty

Prabhas – Anushka Shetty

 

ఈ సందర్భంగా ఓ పిక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ప్రభాస్ విదేశాలకు వెళ్లడంతో ఆయనతో పాటు అనుష్క కూడా తోడుగా ఉందని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఓ ఫొటో పెట్టి ప్రభాస్ ఎక్కడికి వెళ్లినా వదలడం లేదు అంటూ క్యాప్షన్ పెట్టి రచ్చ చేస్తున్నారు. అయితే ప్రభాస్ తో కలిసి అనుష్క వెళ్లిందో లేదో తెలియదు. కానీ ఆ పిక్ మాత్రం ఇప్పటిదీ కాదు. 2015 సంవత్సరానికి సంబంధించినది. బాహుబలి సినిమా ప్రమోషన్ కోసం రాజమౌళి, ప్రభాస్, అనుష్కలతో పాటు పాటు రానా కూడా ఉన్నారు.

Tags

    follow us