Bro Promotions: కటౌట్స్ మీద అభిమానుల ఫోటోలు.. చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా ‘బ్రో’ ప్రొమోషన్స్!
రీసెంట్ గా విడుదలైన ప్రభాస్ ‘ఆదిపురుష్’ చిత్రానికి కూడా ఎంత విన్నూతన రీతిలో ప్రమోషన్స్ చేసారో మన అందరికీ తెలిసిందే. సినిమాకి హైప్ ఒక రేంజ్ లో తీసుకొచ్చారు, ఇప్పుడు బ్రో విషయం లో కూడా అలాగే చెయ్యబోతున్నారు.

Bro Promotions: ఈ నెల 28 వ తారీఖున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘బ్రో ది అవతార్’ చిత్రం విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమోషన్స్ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. పీపుల్స్ మీడియా సంస్థ ఎప్పుడూ కూడా విన్నూతన రీతిలో ప్రొమోషన్స్ చేస్తూ ఉంటారు.
రీసెంట్ గా విడుదలైన ప్రభాస్ ‘ఆదిపురుష్’ చిత్రానికి కూడా ఎంత విన్నూతన రీతిలో ప్రమోషన్స్ చేసారో మన అందరికీ తెలిసిందే. సినిమాకి హైప్ ఒక రేంజ్ లో తీసుకొచ్చారు, ఇప్పుడు బ్రో విషయం లో కూడా అలాగే చెయ్యబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించి కటౌట్స్ మొత్తం ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ వ్యాప్తంగా మూవీ టీం ఏర్పాటు చేయనుంది. ఈ కటౌట్స్ మామూలు కటౌట్స్ కాదు, దీనికి కూడా ఇప్పటి వరకు ఏ మేకర్స్ కూడా ఆలోచించని విధంగా ఆలోచించారు పీపుల్స్ మీడియా సంస్థ.
అదేమిటంటే అభిమానులు తమ ఫోటోగ్రాఫ్స్ ని పంపిస్తే ఆ ఫొటోస్ ని డిజిటల్ రూపం లో కటౌట్స్ మీద ముద్రిస్తారట. అభిమానులు తమ ఫోటోలను స్కాన్ చేసి , పీపుల్స్ మీడియా సంస్థ కి మెయిల్ చేస్తే వాళ్ళు ప్రతీ జిల్లాలో ఆ అభిమానులకు సంబంధించిన ఫోటోలను ప్రింట్ చేసి మెయిన్ థియేటర్స్ కి పంపిస్తారట. అంటే పవన్ కళ్యాణ్ కటౌట్స్ లో మనం పంపిన ఫోటోలను చూసుకోవచ్చు అన్నమాట.
ఇక ఈ సినిమాకి సంబంధించిన టీజర్ మరియు మొదటి లిరికల్ వీడియో సాంగ్ ఈమధ్యనే విడుదల అయ్యి మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి. ఈ వారం లోనే ఈ సినిమాకి సంబంధించినా రెండవ సాంగ్ ని విడుదల చేయబోతున్నారట. ఈ సాంగ్ శ్లోకం రూపం లో ఉండబోతుందని తెలుస్తుంది. ఇక అంతే కాకుండా సాయి ధరమ్ తేజ్ కూడా ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ లో పాల్గొనబోతున్నాడని టాక్.
