Mahesh Babu: ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అంటారు. అంటే జీవితంలో ఆ రెండు కలలను నెరవేర్చుకోవడం చాలా కష్టం అంటారు. అయితే ఇప్పుడు చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు అపార్ట్ మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీ అంటూ సిటీ అవతల లోపల మంచి ప్రాజెక్టులను ప్రకటించి అగ్రహీరోలతో ప్రకటనలు చేసి.. జనాలను ఆకర్షించి.. వారి నుంచి లక్షలు వసూలు చేసి ఆ రియల్ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు.అయితే అంతా బాగానే ఉన్నా పేరున్న రియల్ సంస్థలు కూడా దివాలా తీసి ప్రాజెక్టులను మధ్యలోనే ఆపివేస్తే ఏమనాలి.. ఇప్పుడు మహేష్ బాబు రికమండ్ చేశాడని ఆయన పేరుతో యాడ్స్ వచ్చి ఓ రియల్ వెంచర్ అపార్ట్ మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలను పెద్ద ఎత్తున కొన్నారు జనాలు. చాలా మంది వాటిల్లో ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు నెత్తి నోరు బాదుకుంటున్న పరిస్థితి నెలకొంది.
ఆ మధ్య టీవీ ఆన్ చేస్తే చాలు ‘మహేష్ బాబు’ తన ఫ్యామిలీలోని భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి మరీ టోటల్ ఫ్యామిలీని పెట్టి ఒక రియల్ ఎస్టేట్ యాడ్ చేశాడు. ‘మీ ఫ్యూచర్ కు మీరే సూపర్ స్టార్’ అంటూ మహేష్ బాబు చెప్పేసరికి.. అంతటి ప్రశాంతమైన ఇళ్ల కోసం జనాలు ఎగబడ్డారు.
నిజానికి మహేష్ బాబుకు ఈ రియల్ ఎస్టేట్ యాడ్ లో ఫ్యామిలీ మొత్తంతో కలిసి నటించడానికి కోట్లు ఇచ్చారట.. మహేష్ కూడా కొన్ని కోట్లను ఈ యాడ్ ప్రకటన కోసం తీసుకున్నాడు. మహేష్ కు సన్నిహితుడైన ఓ దర్శకుడి స్నేహితులే ఈ రియల్ వెంచర్ స్టాట్ చేయడంతో అతడిని నమ్మి మహేష్ ఏకంగా ఫ్యామిలీతో కలిసి యాడ్ లో నటించి మరీ దీనికి పాపులారిటీ తెచ్చాడు.
కట్ చేస్తే .. మహేష్ యాడ్ లో నటించాడని.. ఆ రియల్ ఎస్టేట్ వెంచర్ ను నమ్మి వేల మంది ఆ సంస్థ వెంచర్లలో ఇళ్లు, ప్లాట్లు కొన్నారు. అడ్వాన్సులు ఇచ్చారు. కానీ ఇప్పుడవి సగంలోనే ఆగిపోయాయి. దీంతో మహేష్ ను నమ్మి నిండా మునిగామని లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.
దీన్ని బట్టి హీరోలు ప్రకటనలు చేసే ముందు ఒళ్లు దగ్గరపెట్టుకొని చేయాలి. ఎంత దగ్గరివారైనా సరే వారి విశ్వసనీయతను అంచనావేయాలి. ఒకవేళ ఆ ప్రాజెక్టులు పూర్తి కాకుంటే ప్రజలు కోట్లలో మునిగిపోతారు. దానికి హీరోలే బాధ్యులవుతారని గమనించారు. వారి ఉసురు తగులుతంది. ఇదివరకే బాలీవుడ్, టాలీవుడ్ హీరోలపై ఇలాంటి యాడ్ లోనే కేసులయ్యాయి కూడా.. ప్రజలను ప్రభావితం చేసే.. లక్షలు, కోట్లు పెట్టుబడి పెట్టే రియల్ ఎస్టేట్ సహా కీలక రంగాల్లో ప్రకటనలు చేసేముందు అందరూ హీరోలు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.