రఫ్పాడిస్తానంటున్న పాయల్

తెరపై బోల్డ్ గా కనిపించే పాయల్‌ రాజ్‌పుత్‌ తొలిసారి ఛాలెంజిగ్ రోల్ చేస్తోంది. ‘ఆర్‌ఎక్స్‌-100’లో పాయల్ నటనకు కుర్రకారు ఫిదా అయ్యారు. దీంతో యువతలో ఆమెకు భారీ ఫ్యాన్ పాలోయింగ్ ఏర్పడింది. తొలినాళ్లలో గ్లామర్‌ పాత్రలకే పరిమితమైన తాజాగా నటనకు అవకాశం ఉన్న పాత్రలనే ఎంచుకుంటుంది. ప్రణదీప్ దర్శకత్వంలో పాయల్ తాజాగా ఓ మూవీ చేస్తుంది. క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ మిస్టరీ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతుంది. ఈ మూవీలో పాయల్ తొలిసారి ఐపీఎస్ అధికారిగా కనిపించబోతుంది. నేరాలకు […]

  • Written By: Neelambaram
  • Published On:
రఫ్పాడిస్తానంటున్న పాయల్

తెరపై బోల్డ్ గా కనిపించే పాయల్‌ రాజ్‌పుత్‌ తొలిసారి ఛాలెంజిగ్ రోల్ చేస్తోంది. ‘ఆర్‌ఎక్స్‌-100’లో పాయల్ నటనకు కుర్రకారు ఫిదా అయ్యారు. దీంతో యువతలో ఆమెకు భారీ ఫ్యాన్ పాలోయింగ్ ఏర్పడింది. తొలినాళ్లలో గ్లామర్‌ పాత్రలకే పరిమితమైన తాజాగా నటనకు అవకాశం ఉన్న పాత్రలనే ఎంచుకుంటుంది. ప్రణదీప్ దర్శకత్వంలో పాయల్ తాజాగా ఓ మూవీ చేస్తుంది. క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ మిస్టరీ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతుంది. ఈ మూవీలో పాయల్ తొలిసారి ఐపీఎస్ అధికారిగా కనిపించబోతుంది. నేరాలకు పాల్పడే వారిని రఫ్పాడించేందుకు పాయల్ సిద్ధమవుతుండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

కైవల్య క్రియేషన్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రణదీప్ తెరక్కిక్కిస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ వద్ద ప్రణదీప్ పలు చిత్రాలకు పని చేశాడు. పాయల్ ఇమేజ్ మార్చేలా ఆమె క్యారెక్టర్ ను దర్శకుడు డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా సినిమా ఒక షెడ్యూల్ మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. మార్చి నెలాఖరుకు సినిమా పూర్తి చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది. ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మార్చి 4న విడుదల చేయనున్నట్టు చిత్రబృందం తెలిపింది. వేసవిలో సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది.

సంబంధిత వార్తలు