
Payal Ghosh
Payal Ghosh: హాలీవుడ్ లో మొదలైన మీటూ ఉద్యమం బాలీవుడ్ కి పాకింది. అలాగే టాలీవుడ్, కోలీవుడ్ లో కూడా ప్రభావం చూపింది. తనుశ్రీ దత్తా ప్రముఖ నటుడు నానా పాటేకర్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. కోలీవుడ్ లో సింగర్ చిన్మయి శ్రీపాద రచయిత వైరముత్తు మీద అలుపెరగని పోరాటం చేస్తున్నారు. వైరముత్తు పలువురు అమ్మాయిలపై లైంగిక వేధింపులకు దిగారని ఆరోపించారు. దీని వలన సింగర్ చిన్మయి కెరీర్ ప్రమాదంలో పడింది. అయినా అతని మీద తన పోరాటం ఆపలేదు. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే శ్రీరెడ్డి మీటూ ఆరోపణలు చేయడం జరిగింది. దగ్గుబాటి అభిరామ్ అవకాశాలు ఆశచూపి తనను లైంగికంగా వాడుకున్నాడని ప్రైవేట్ ఫోటోలు బయటపెట్టింది.
గత పదేళ్లలోనే బోలెడు కేసులు వెలుగులోకి వస్తాయి. లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన వాళ్ళు, ఎదుర్కొన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాటిలో సంచలనం రేపిన కేసు అనురాగ్ కశ్యప్-పాయల్ ఘోష్. దర్శకుడు అనురాగ్ తనను రేప్ చేశాడని పాయల్ ఘోష్ ఆరోపించారు. ఒక హోటల్ గదిలో తనపై లైంగిక దాడి చేశాడని ఆమె మీడియాకు వెల్లడించారు. చాలా కాలం ఈ వివాదం బాలీవుడ్ లో నడిచింది.

Payal Ghosh
తాజాగా మరోసారి పాయల్ ఘోష్ ఈ విషయాన్ని తెరపైకి తెచ్చారు. ఆమె ట్విట్టర్ వేదిక ”నేను సౌత్ ఇండియా దర్శకులతో పనిచేశాను. వారిలో నేషనల్ అవార్డు విన్నర్స్ కూడా ఉన్నారు. ఎవరూ నా పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదు. కానీ నేను అనురాగ్ కశ్యప్ తో పని చేయలేదు. మా మూడో మీటింగ్ లోనే నన్ను రేప్ చేశాడు. కానీ సౌత్ ఇండియా దర్శకులు చాలా గౌరవంగా ట్రీట్ చేశారు. అలాంటప్పుడు నేను సౌత్ పరిశ్రమను పొగిడితే తప్పేంటి.. అని అన్నారు.
అలాగే ఎన్టీఆర్ గురించి ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన వండర్ ఫుల్ హ్యూమన్ బీయింగ్. జెంటిల్ మెన్. ఆయనతో కూడా నేను వర్క్ చేశాను. నాతో ఏనాడూ తప్పుగా ప్రవర్తించింది లేదు. అందుకే సౌత్ ఇండియన్ మూవీ ఇండస్ట్రీ మీద నాకు ప్రేమ, గౌరవం ఉన్నాయి… అంటూ ట్వీట్ చేశారు. పాయల్ ఘోష్ తెలుగులో ప్రయాణం, ఊసరవెల్లి వంటి చిత్రాలు చేశారు.
I worked in south film industry with 2 national award winning directors &star directors but nobody even touched me inappropriately but in Bollywood I haven’t even worked with Anurag Kashyap,bt he raped me on our third meeting, now say why I shouldn’t brag about south…!!!
— Payal Ghoshॐ (@iampayalghosh) March 18, 2023