Pawan Kalyan : మైనారిటీలకు జగన్ ప్రభుత్వంలో ఇంత అన్యాయం.. హృదయాలను కదిలిస్తున్న పవన్ కళ్యాణ్ మాటలు!
ఈ యాత్ర కి ఈ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి విడత యాత్ర ని విజయవంతంగా పూర్తి చేసుకోగా,రెండవ విడత యాత్ర ని రీసెంట్ గానే ప్రారంభించాడు పవన్ కళ్యాణ్.

Pawan Kalyan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఇప్పుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ‘వారాహి విజయ యాత్ర’ చుట్టూ తిరుగుతున్నాయి. ఈ యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో పుట్టించిన ప్రకంపనలు మామూలు రేంజ్ కాదు. వారాహి యాత్ర అంటే ఎదో మాములు రాజకీయ యాత్ర అని అనుకూంమ్నారు కానీ, ఇలా నిజాలను ఆధారాలతో సహా జనాల ముందుకు తీసుకొచ్చి నిలదీయడం అనేది ఇప్పటి వారుకు ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా చెయ్యలేదు, ఓపక్క పవన్ కళ్యాణ్ తప్ప.
అందుకే ఈ యాత్ర కి ఈ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి విడత యాత్ర ని విజయవంతంగా పూర్తి చేసుకోగా,రెండవ విడత యాత్ర ని రీసెంట్ గానే ప్రారంభించాడు పవన్ కళ్యాణ్. ఈ యాత్ర మొదటి విడత యాత్ర కంటే కూడా జనాల్లో డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అని చెప్పాలి. నేడు తనకు కి చేరుకున్న ఈ యాత్రలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సెన్సేషనల్ గా మారాయి.
ఇక పోతే మైనారిటీలకు జగన్ ప్రభుత్వం చేస్తున్న మోసాల గురించి పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. ముఖ్యంగా అంబెడ్కర్ విద్య దీవెన కి కేటాయించిన నిధులను మరలించడం దగ్గర నుండి, రద్దు చేసిన 24 పధకాల గురించి కాగ్ ఇచ్చిన రిపోర్ట్స్ ని చేత పట్టుకొని ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారింది. వీటి గురించి ఒక్క వైసీపీ పార్టీ నాయకుడు అయినా కౌంటర్ ఇస్తాడేమో అని చూస్తున్నారు జనసేన పార్టీ నాయకులూ, కార్యకర్తలు.
ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ కాగ్ రిపోర్ట్స్ గురించి చెప్పిన వాటిపై వైసీపీ నాయకులు ఒక్కరు కూడా నోరు మెదపలేకపొయ్యారు. విషయం మొత్తం వాలంటీర్ వ్యవస్థపై చేసిన కామెంట్స్ వైపు మరలించారు. కనీసం రేపైనా దీని గురించి వైసీపీ నాయకులు స్పందిస్తారో లేదో చూడాలి. ఇకపోతే నేడు జరిగిన తణుకు బహిరంగ సభతో జనసేన పార్టీ రెండవ విడత ‘వారాహి విజయ యాత్ర’ ముగిసింది.
