YCP Vs Pawan : ప్రో వైసీపీ బ్యాచ్ ను ఏరవేస్తున్న పవన్
అందుకే ఇప్పుడు కఠినచర్యలకు ఉపక్రమిస్తున్నారు. పార్టీలో ఉంటూ నష్టం చేస్తున్నవారిని బయటకు పంపించేందుకు సిద్ధపడుతున్నారు. సో ‘పవనన్నను అభిమానిస్తాం.. పవన్ కే ఓటు వేస్తాం’ అన్న స్లోగన్ ను బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

YCP Vs Pawan : ‘పవనన్నంటే అభిమానం.. కానీ జగనన్నకు ఓటేస్తాం’.. జనసేనలో ఈ తరహా అభిమానులు అధికం. లేకుంటే గత ఎన్నికల్లో ఫలితాలు ఎందుకు నిరాశజనకంగా వచ్చాయి. సో జనసేనలో ప్రో వైసీపీ బ్యాచ్ ఒకటుందన్న మాట. అయితే దీనిని ఏనాడో పవన్ గుర్తించారు. ఇటీవల మంగళగిరిలో జరిగిన సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇలా వచ్చి అలా వెళ్లే వారికి జనసేనలో స్థానం లేదు. మీకు అవసరం లేకుంటే వైసీపీలోకి వెళ్లిపోవచ్చు అని హెచ్చరికలు పంపారు. పర్టిక్యులర్ గా వైసీపీ అనే ప్రస్తావించేసరికి పవన్ కూడా సమాచారం ఉందన్న మాట. ప్రో వైసీపీ బ్యాచ్ ను వీలైనంత త్వరగా బయటకు పంపించే అవకాశం ఉందన్నమాట. నాదేండ్ల మనోహర్ ను వెనుకేసుకొచ్చే క్రమంలో పవన్ ప్రో వైసీపీ బ్యాచ్ విషయం ప్రస్తావించారు.
అన్నింటిపై ఫుల్ క్లారిటీ..
జనసేన ఆవిర్భవించి సుదీర్ఘ కాలం అవుతున్న నేపథ్యంలో రాజకీయాలపై పూర్తి క్లారిటీ తెచ్చుకున్నారు. ఏ అంశంపైనైనా ఫుల్ క్లారిటీగా మాట్లాడుతున్నారు. ఒక మాట మీద ఉండడం లేదన్న అపవాదు నుంచి బయటపడుతున్నారు. కన్ఫ్యూజ్ కు తావు లేకుండా వ్యవహరిస్తున్నారు. సరైన టైము చూసి మాట్లాడుతున్నారు. పార్టీ అంతర్గత వ్యవహారమైనా.. పొత్తుల విషయమైనా ఎక్కడా అనుమానాలకు తావులేకుండా నడుచుకుంటున్నారు.
పొత్తుల విషయంలో ఎన్నో ఊహాగానాలకు, అనుమానాలను తెరదించారు. తాను ముందు చెప్పిన దానికే కట్టుబడ్డారు. వైసీపీ విముక్త ఏపీయే తన ప్రధాన ఉద్దేశ్యమని.. అప్పటికీ, ఇప్పటికీ అదే స్టాండ్ ని పాటిస్తున్నారు.
వెనుకడుగు వేయకుండా..
రాజకీయాలు అన్నాక ఆటుపోట్లు ఉంటాయి. కష్ట సుఖాలు ఉంటాయి. వాటన్నింటినీ అధిగమిస్తూ ముందుకు సాగుతున్నారు. పవన్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత చాలా విధాలుగా చులకన చేశారు. కానీ ఎక్కడా ఆయన వెనక్కి తగ్గలేదు. వెనుకడుగు వేయలేదు. తనకున్నబలం అంచనా వేయగలరు. విస్పష్టంగా చెప్పగలరు. నికర్సయిన రాజకీయాన్నే అలవాటు చేసుకున్నారు. అయితే అది మైనస్ గా మారినా తన వైఖరిని మార్చుకోలేదు. అయితే పార్టీకి ఏది నష్టం చేస్తుందో మాత్రం గుర్తించగలుగుతున్నారు. అందుకే ఇప్పుడు కఠినచర్యలకు ఉపక్రమిస్తున్నారు. పార్టీలో ఉంటూ నష్టం చేస్తున్నవారిని బయటకు పంపించేందుకు సిద్ధపడుతున్నారు. సో ‘పవనన్నను అభిమానిస్తాం.. పవన్ కే ఓటు వేస్తాం’ అన్న స్లోగన్ ను బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
