Akira Nandan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఏ చిన్న వార్త వచ్చినా అభిమానులు పండుగ చేసుకుంటారు..అలాంటి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ అతని సొంతం..ఇక అలాంటి పవర్ స్టార్ కొడుకు అకిరా నందన్ అంటే అభిమానులు ఎంత అభిమానిస్తారో తెలిసిందే..ఇతని కటౌట్ మరియు గ్లామర్ చూసి ఫ్యాన్స్ మురిసిపోతుంటారు..రేణు దేశాయ్ ఇంస్టాగ్రామ్ లో అప్పుడప్పుడు అకిరా నందన్ కి సంబంధించిన వీడియోలు మరియు ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఉంటుంది..అవి చూసి ఫాన్స్ అకిరాని హీరో గా ఎప్పుడు లాంచ్ చెయ్యబోతున్నారు అని రేణు దేశాయ్ ని అడుగుతూ ఉంటారు.
అయితే అకిరా కి నటనకంటే మ్యూజిక్ మీద ఎక్కువ మక్కువని..సినిమాల్లోకి వస్తాడా లేదా అనేది వాడి ఇష్టానికే వదిలేశామని రేణు దేశాయ్ ఇంస్టాగ్రామ్ లో పలు సందర్భాలలో తెలిపింది..పవన్ కళ్యాణ్ లాంటి ఫ్యాన్ బేస్ ఉన్న హీరో కి ఆయన లెజసీ ని ముందుకు కొనసాగించాలంటే కచ్చితంగా సినిమాల్లోకి అకిరా రావాల్సిందే అని అభిమానులు పట్టుబడుతున్నారు.
ఇక అకిరా కి వయసు పెరిగే కొద్ది తన తండ్రి లోని స్టైలింగ్ మరియు చార్మ్ ని అధిగమించే లాగ తయారవుతున్నాడని..సినిమాల్లోకి వస్తే ఇతను తన తండ్రిలాగానే ఇండస్ట్రీ లో నెంబర్ 1 హీరోగా కొనసాగుతాడని అభిమానులు బలంగా నమ్ముతున్నారు..ఇక లేటెస్ట్ గా అకీరానందన్ తన చెల్లెలు ఆధ్యతో కలిసి పోట్లాడుతున్న వీడియో ని సోషల్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది రేణు దేశాయ్.
బ్లూ జాకెట్ వేసుకుకొని మీసాలు గెడ్డం తో తండ్రి రేంజ్ స్టైలింగ్ తో అకిరా ఉన్న ఫోటోలు చూసి అభిమానులు ఎంతో మురిసిపోతున్నారు..ఆ ఫోటోలను మీరు క్రింద చూడవచ్చు..అకిరా నందన్ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యే కొద్దీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో ఎప్పుడు అతనిని వెండితెర మీద చూస్తామా అనే కుతూహులం పెరిగిపోతుంది..మరి అకిరా సినిమాల్లో ఎంట్రీ ఇస్తాడా లేదా అనేది చూడాలి.