Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మళ్ళీ ఊపందుకుంది..జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గ్రౌండ్ లో ఉన్నంత కాలం రాజకీయాలు చాలా రంజుగా ఉంటాయి..నిన్న తన ‘వారాహి’ బండి కి పూజ కార్యక్రమలు చేయించడం కోసం ఇంద్ర కీలాద్రి అమ్మవారి దగ్గరకు వచ్చిన సంగతి తెలిసిందే..అనంతరం ఆయన తన పార్టీ కార్యాలయం లో కార్యకర్తలతో సమావేశం అయ్యారు..భవిష్యత్తు కార్యాచరణ ఏమిటో ప్రస్తావిస్తూనే,ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపాడు..ఈ సందర్భంగా ఆయన మీడియా ముందు చెప్పిన పలు పచ్చి నిజాలు ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారింది..జగన్ అప్పట్లో ఇంత రౌడీయిజం చేశాడా అని ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపొయ్యేలా చేసాయి ఈ నిజాలు.

Pawan Kalyan
ఆయన మాట్లాడుతూ ‘ఆంధ్ర ప్రదేశ్ లో కుల పిచ్చి తారాస్థాయికి చేరింది..మన సామజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రి అభ్యర్థి కాబట్టి అతనికే మేము ఓటు వేస్తాము అంటే ఎలా..మన తర్వాతి తరం వారికి దీని ద్వారా ఏమి నేర్పిస్తున్నాము’ అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించాడు..ఇంకా ఆయన మాట్లాడుతూ ‘జగన్ టీనేజ్ వయస్సులో ఉన్నప్పుడు కడపలోని పులివెందుల లో ఒక SC కులస్తుడిని జైలులో పెట్టి ఇష్టమొచ్చినట్టు కొట్టిన ఘన చరిత్ర ఉంది..అలాంటి మనిషి చేతిలోనే ప్రస్తుతం లా & ఆర్డర్ ఉంది’ అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడాడు.

Pawan Kalyan
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఈ విషయం పై మానవ హక్కుల సంఘం ఎంత మాత్రం చర్యలు తీసుకుంది..అధికారం లో ఉన్నప్పుడు ఎలాగో ఆయనని ఏమి చెయ్యలేరు అనుకోండి..కానీ అధికారం లో లేనప్పుడు కూడా ఈ విషయాలు తెలిసి తెలియనట్టు ఎందుకు ప్రవర్తించారు’ అంటూ పవన్ వ్యాఖ్యానించాడు..నేడు రిపబ్లిక్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసారు..’తెలంగాణ ప్రజల్లో ఉన్న చైతన్యం..ఆంధ్ర ప్రజల్లో లేదు..ఏపీ ని మరోసారి విడగొడతాము అంటే తోలు తీస్తాము..మీకు మరో రాష్ట్రము కావాలా..అలంటి ధోరణి చూపిస్తే ఈసారి నా అంతటి తీవ్రవాది ని మీరు ఎక్కడా చూసి ఉండరు’ అంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించాడు పవన్ కళ్యాణ్.