Pawan Kalyan- Kalyan Ram: కళ్యాణ్ రామ్ నిర్మాతగా పవన్ కళ్యాణ్ కొత్త సినిమా..కానీ చివరికి ఏమైందంటే!
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద ఈయన నిర్మించిన మొదటి సినిమా ‘అతనొక్కడే’ అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్. ఆ సినిమా ఇచ్చిన ఊపుతో కళ్యాణ్ రామ్ వరుసగా తాను హీరో గా నటించే సినిమాలకు తానే నిర్మాతగా వ్యవహరించాడు, మధ్యలో దారుణమైన ఫ్లాప్స్ వచ్చాయి, అయినా కూడా నిలబడ్డాడు.

Pawan Kalyan- Kalyan Ram: ఈమధ్య కాలం లో మన తెలుగు హీరోలు ఒకపక్క నటులుగా కొనసాగుతూనే మరోపక్క నిర్మాణ రంగం లోకి అడుగుపెట్టిన సంగతి మన అందరికీ తెలిసిందే. కొంతమంది నిర్మాతలు కూడా సక్సెస్ అయ్యి బాగా డబ్బులు సంపాదించుకున్నారు. కొంతమందికి సక్సెస్ లు రాక ఇక మనకి వాటితో ఎందుకులే అని సైలెంట్ గా తప్పుకున్నారు. కానీ కొంతమంది మాత్రం ఫ్లాప్స్ వచ్చినప్పటికీ తట్టుకొని నిలబడి, ఆ తర్వాత హిట్లు సూపర్ హిట్లు అందుకొని నిర్మాతలుగా కూడా స్థిరపడ్డారు. అలాంటి వారిలో ఒకరే నందమూరి కళ్యాణ్ రామ్.
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద ఈయన నిర్మించిన మొదటి సినిమా ‘అతనొక్కడే’ అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్. ఆ సినిమా ఇచ్చిన ఊపుతో కళ్యాణ్ రామ్ వరుసగా తాను హీరో గా నటించే సినిమాలకు తానే నిర్మాతగా వ్యవహరించాడు, మధ్యలో దారుణమైన ఫ్లాప్స్ వచ్చాయి, అయినా కూడా నిలబడ్డాడు.
అయితే కళ్యాణ్ రామ్ కేవలం తన సినిమాలు, తన కుటుంబ హీరోల సినిమాలు మాత్రమే కాకుండా, ఇతర హీరోలతో కూడా సినిమాలు చెయ్యాలని చూసాడు. మాస్ మహారాజ రవితేజ తో గతం లో కిక్ 2 అనే చిత్రం చేసాడు, ఈ సినిమా పెద్ద ఫ్లాప్ అయ్యింది. అలాగే పటాస్ సినిమా ప్రారంభం అయ్యే ముందు , ఆ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ తో తీద్దాం అని డైరెక్టర్ అనిల్ రావిపూడి కి చెప్పాడట.
కానీ ఆయన మీరు చేస్తేనే బాగుంటుంది అనేలోపు చివరికి ఆ చిత్రం కళ్యాణ్ రామ్ చేసాడు. ఫలితం ఎంత అద్భుతంగా వచ్చిందో మన అందరికీ తెలిసిందే, అప్పటి వరకు వరుస ఫ్లాప్స్ తో ఉన్న కళ్యాణ్ రామ్, ఈ సినిమాతో హిట్ ట్రాక్ లోకి వచ్చాడు. ఇక ప్రస్తుతం ఆయన తన తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ తో ‘దేవర’ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత వెంటనే ప్రశాంత్ నీల్ తో చెయ్యబోయే సినిమాకి కూడా కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
