Pawan Kalyan- Shankar: శంకర్ దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ కొత్త సినిమా..? త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతోందా!
దిల్ రాజు మాత్రం ఈ సినిమా పవన్ కళ్యాణ్ కంటే రామ్ చరణ్ కి బాగా సూట్ అవుతుంది , రామ్ చరణ్ తో చేద్దాం అంటూ ఆ ప్రాజెక్ట్ ని మరలించాడు. అయితే శంకర్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో మరో సరికొత్త సినిమా చెయ్యడానికి స్క్రిప్ట్ సిద్ధం చేసాడట. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.

Pawan Kalyan- Shankar: సౌత్ ఇండియా లో రాజమౌళి తర్వాత అంతటి క్రేజ్ మరియు బ్రాండ్ ఇమేజి ఉన్న దర్శకుడు శంకర్. ఆయనతో సినిమా చెయ్యాలని ప్రతీ స్టార్ హీరోకి ఉంటుంది. మనం చిన్నతనం లో ఉన్నప్పుడే పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ తో చెడుగుడు ఆడుకున్న డైరెక్టర్ ఆయన. ప్రస్తుతం ఆయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ‘గేమ్ చేంజర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చిత్రీకరణ చివరి దశకి చేరుకుంది.
ఈ చిత్రం తో పాటుగా ఆయన కమల్ హాసన్ తో ఇండియన్ 2 అనే సినిమా కూడా తీస్తున్నాడు. నెల రోజుల్లో 15 రోజులు ఇండియన్ 2 చిత్రానికి కేటాయిస్తే, మరో 15 రోజులు ‘గేమ్ చేంజర్’ చిత్రానికి సమయాన్ని కేటాయిస్తున్నారు శంకర్. అయితే గేమ్ చేంజర్ చిత్రాన్ని ముందుగా పవన్ కళ్యాణ్ తో చెయ్యాలని అనుకున్నాడట శంకర్.
కానీ దిల్ రాజు మాత్రం ఈ సినిమా పవన్ కళ్యాణ్ కంటే రామ్ చరణ్ కి బాగా సూట్ అవుతుంది , రామ్ చరణ్ తో చేద్దాం అంటూ ఆ ప్రాజెక్ట్ ని మరలించాడు. అయితే శంకర్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో మరో సరికొత్త సినిమా చెయ్యడానికి స్క్రిప్ట్ సిద్ధం చేసాడట. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో ‘బ్రో’, ‘హరి హర వీరమల్లు’, ‘#OG’,’ఉస్తాద్ భగత్ సింగ్’ అని నాలుగు చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాలు పూర్తి అయినా తర్వాతే ఈ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తాడట పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆయన హీరోగా నటించిన ‘బ్రో ది అవతార్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్నది. వచ్చే నెల 28 వ తారీఖున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదే సంవత్సరం లో పవన్ కళ్యాణ్ మరో చిత్రం #OG కూడా విడుదల అయ్యే అవకాశం ఉంది.
