Pawan kalyan’s ‘Hari Hara Veera Mallu’ movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. దర్శకుడు క్రిష్ ల మొదటి ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ “హరి హర వీర మల్లు”, ప్రారంభించినప్పటి నుండి అనేక అడ్డంకులను ఎదుర్కొంటోంది. తాజాగా ఈ సినిమా పూర్తిగా ఆగిపోయినట్టు తెలిసింది. సినిమాను మిగిలిన షూటింగ్ చేయకుండానే రద్దు చేసినట్టుగా టాలీవుడ్ నుంచి వార్తలు వస్తున్నాయి.
మూడేళ్ల క్రితమే ఈ చిత్రాన్ని ప్రకటించారు. షూటింగ్ కూడా 2020లో ప్రారంభమైంది. అయితే కోవిడ్-19 కారణంగా సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను కొనసాగించలేకపోయింది. ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ కొన్ని యుద్ధ విద్యలు కూడా నేర్చుకొని తర్ఫీదు పొంది లుక్ కూడా మార్చారు.
ఈ ఏడాది ప్రారంభంలో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చినప్పుడు ఈ చిత్రం జూలై నాటికి షూటింగ్‌ను పూర్తి చేస్తుందని అనిపించింది. కానీ సినిమా నిర్మాణం మూడు నెలల క్రితం ఉన్న చోట నుంచి పెద్దగా ముందుకు కదలలేదు.
దర్శకుడు క్రిష్ వల్ల పవన్ కళ్యాణ్ తీవ్ర నిరాశకు గురయ్యాడని యూనిట్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. పవన్ స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేయాలనుకున్నాడు. మంచి సన్నివేశాలతో రావాలని క్రిష్‌ని కోరాడు. కానీ దర్శకుడు కథలో మార్పులు చేయడానికి ఇష్టపడడం లేదని.. ఇంకా పవన్ చెప్పిన మార్పులు చేయలేదని సమాచారం. దీంతో పవన్ షూటింగ్ ఆపేశాడని తెలిసింది. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఆగిపోతే నిర్మాత ఏఎం రత్నం నిండా మునగడం ఖాయం. పవన్, దర్శకుడు క్రిష్ పంతాల నడుమ పాపం నిర్మాత బలయ్యాలే ఉన్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరోవైపు అక్టోబర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పర్యటన చేయనున్నట్లు నటుడు ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితి ఏంటంటే.. పవన్ కళ్యాణ్ ఈ సినిమాను పూర్తిగా రద్దు చేయడమో లేదా ఇకపై అలానే ముందుకు సాగడమో చేసే అవకాశం ఉంది.
మరోవైపు ఈ చిత్రం మరో “ఆచార్య” అవుతుందని పవన్ కళ్యాణ్ అభిమానులు భయపడుతున్నారు, అది కూడా చాలా సంవత్సరాలు ఆలస్యం అయింది. తరువాత బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయ్యింది.