Pawan Kalyan OG Movie : ఓజీ ఫస్ట్ గ్లింప్స్ రివ్యూ… వాడు నరికిన నెత్తురు మరకలు ఏ తుఫాను తుడిచిపెట్టలేదు!
పదునైన కత్తితో పవన్ కళ్యాణ్ శత్రువులను ఊచకోత కోస్తున్నాడు. టీజర్ చివర్లో పవన్ కళ్యాణ్ హిందీ డైలాగ్స్ కాకరేపాయి.

Pawan Kalyan OG Movie : ఒక ఫ్యాన్ బాయ్ దర్శకుడైతే తన ఊహల్లో నచ్చిన హీరోని ఎలా చూపిస్తాడో ఓజీ టీజర్ చూస్తే అర్థం అవుతుంది. పవన్ కళ్యాణ్ బర్త్ డే కానుకగా నేడు ఓజీ ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు.అభిమానులను అంచనాలకు ఈ మాత్రం తగ్గకుండా టీజర్ ఉంది. నటుడు అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ తో టీజర్ మొదలైంది. ”పదేళ్ల క్రితం ముంబైకు తుఫాను వచ్చింది. ఆ తుఫాను ముంబై మొత్తాన్ని ముంచెత్తింది. అయితే ఆ డాన్ నరికిన మనుషుల రక్తపు మరకలను ఏ తుఫాను చెరపలేకపోయింది. అలాంటి వాడు మరలా తిరిగి వస్తే ఎలా ఉంటుంది” అనే అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ తో టీజర్ లో పవన్ ని ఎలివేట్ చేశారు.
బెల్ బాటమ్ ప్యాంటు ధరించిన పవన్ లుక్ ఇది పీరియాడిక్ మూవీ అని గుర్తు చేస్తుంది. టీజర్లో చూపించిన ఆయుధాలు కూడా 80ల కాలం నాటివిగా ఉన్నాయి. కాబట్టి ఓజీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా అని చెప్పొచ్చు. పదునైన కత్తితో పవన్ కళ్యాణ్ శత్రువులను ఊచకోత కోస్తున్నాడు. టీజర్ చివర్లో పవన్ కళ్యాణ్ హిందీ డైలాగ్స్ కాకరేపాయి.
సినిమా అధిక భాగం ముంబై నేపథ్యంలో సాగే అవకాశం ఉంది. అసలు ఈ ఓజీ ఎవరు? ఈ డాన్ నేపథ్యం ఏమిటనేది ఆసక్తికర పరిణామం. గతంలో ఒకటి రెండు చిత్రాల్లో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ రోల్స్ చేశారు. అయితే పూర్తి స్థాయి పాత్రలో నటించలేదు. ఓజీ మూవీ అవుట్ అండ్ అవుట్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. టీజర్లో థమన్ బీజీఎమ్ హైలెట్ గా నిలిచింది. సన్నివేశాలు ఎలివేట్ చేసింది.
నేపధ్య సంగీతం కొట్టడంలో తన తర్వాతే ఎవరైనా అని థమన్ మరోసారి నిరూపించుకున్నాడు. ఆర్ ఆర్ ఆర్ నిర్మాత డివివి దానయ్య ఓజీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాహో ఫేమ్ సుజీత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పవన్ కళ్యాణ్ కి జంటగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుంది. ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్ కీలక రోల్స్ చేస్తున్నారు. ఓజీ వచ్చే ఏడాది విడుదల కానుందని సమాచారం. మొత్తంగా ఓ జీ టీజర్ అంచనాలకు మించి ఉంది.
పవన్ ఓజీ టీజర్ ను కింద చూడొచ్చు..
