APTA 15Th Anniversary : రెండో రోజు “ఆప్త” లో ఘనంగా పవన్ కళ్యాణ్ బర్త్ డే.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు
చివరిగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. వేదికపై జన్మదిన కేక్ ని కట్ చేశారు. ఈ సందర్భంగా పవన్ సినీ రాజకీయ రంగాల్లో చేసిన కృషిని కొనియాడారు.

APTA 15Th Anniversary : అమెరికాలోని అట్లాంటాలో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (APTA) 15వ వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మూడు రోజుల పాటు కొనసాగనున్న వేడుకల్లో భాగంగా రెండో రోజు కార్యక్రమాలు అంబరాన్ని తాకాయి. శ్రీనివాస కళ్యాణం, అత్త సావనీర్, క్రీడా పోటీలు, ఫ్యాషన్ షో, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు.
మంత్రి బొత్స సత్యనారాయణ, అప్త అధ్యక్షుడు ఉదయ్ భాస్కర్ కొట్టే జ్యోతి ప్రజ్వలన చేసి రెండో రోజు కార్యక్రమాలను ప్రారంభించారు. ముందుగా వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని జరిపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఫ్యాషన్ షోకు స్థానికుల నుంచి విశేష ఆదరణ లభించింది. క్రీడా పోటీలు సైతం నిర్వహించారు. క్రీడాకారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
కార్యక్రమంలో చివరిగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. వేదికపై జన్మదిన కేక్ ని కట్ చేశారు. ఈ సందర్భంగా పవన్ సినీ రాజకీయ రంగాల్లో చేసిన కృషిని కొనియాడారు. పవన్ చిత్రాల్లో పాటలకు డాన్సులతో హోరెత్తించారు.అమెరికాలో స్థిరపడిన తెలుగు ప్రజలు భారీగా హాజరయ్యారు. కార్యక్రమంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సమంత, లయ, సందీప్ కిషన్, సంపత్ నంది, మెహరీన్ ఫిర్జా దా సైతం హాజరయ్యారు.
కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, బిజెపి ఎంపీ బండి సంజయ్, పసుపులేటి హరిప్రసాద్, సత్య బొలిశెట్టి, రామ్ బండ్రెడ్డి, కళ్యాణ్ దిలీప్ సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ కోటి, గేయ రచయిత అనంత్ శ్రీరామ్ తదితరులు హాజరయ్యారు.
