
Hyper Aadi, ntr
Hyper Aadi: బుల్లితెర మీద జబర్దస్త్ అనే కామెడీ షో తో మన అందరికీ పరిచయమై తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో అనతి కాలం లోనే స్టార్ కమెడియన్ గా ఎదిగిన నటుడు హైపర్ ఆది. ఇప్పుడు ఈయన లేని సినిమా అంటూ ఏది లేదు. ఒకప్పుడు సునీల్ , బ్రహ్మానందం లాంటి వారు ఎలా అయితే ఇండస్ట్రీ లో వరుస సినిమాలతో వీళ్ళు లేనిదే సినిమా లేదు అనిపించేవారో ఇప్పుడు హైపర్ ఆది స్థాయి కూడా అదే రేంజ్ కి చేరుకుంది.
ఒక చిన్న సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసుకునే ఒక కుర్రాడు, ఈరోజు ఇండస్ట్రీ లో ఈ రేంజ్ కి ఎదగడం అంటే మామూలు విషయం కాదు.తన జీవితాన్నే రిస్క్ లో పెట్టి ఈ రంగం లోకి దిగినందుకు మంచి ఫలితమే దక్కింది. కేవలం కామెడీ చెయ్యడం మాత్రమే కాదు, అద్భుతమైన డైలాగ్స్ రాయడం లో కూడా హైపర్ ఆది కి గొప్ప టాలెంట్ ఉంది.
అయితే హైపర్ ఆది కి ఈ అవకాశాలన్నీ కేవలం హీరోలకు భజన చెయ్యడం వల్లే అని అందరూఅంటూ ఉంటారు.హైపర్ ఆదికి మొదటి నుండి పవన్ కళ్యాణ్ అంటే వీరాభిమానం.సినిమా ఇండస్ట్రీ కి చెందిన వాడైనా కూడా ధైర్యం గా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కి సపోర్టుగా నిలబడి, ప్రభుత్వం పై విమర్శలు చేసిన ఆయన ధైర్యానికి అందరూ మెచ్చుకున్నారు. అయితే నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ కి ఒక రేంజ్ ఎలివేషన్స్ ఇస్తూ వచ్చిన హైపర్ ఆది, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కి కూడా అదే రేంజ్ ఎలివేషన్స్ ఇచ్చాడు.మొన్న జరిగిన ‘ధమ్కీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా వచ్చిన ఎన్టీఆర్ పై హైపర్ ఆది ప్రశంసల వర్షం కురిపించాడు.

Hyper Aadi, ntr
ఆయన మాట్లాడిన మాటలను చూస్తే ఇతను ఎన్టీఆర్ అభిమానా? అనే సందేహం వ్యక్తం అయ్యింది ఫ్యాన్స్. కేవలం ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ గురించి మాత్రమే కాదు, తనకి సినిమాల్లో అవకాశాలు ఇస్తున్న కుర్ర హీరోల గురించి కూడా ఆయన ఇదే రేంజ్ లో ప్రశంసలు కురిపించిన సందర్భాలు ఉన్నాయి.ఇదంతా చూసి ఇలా భజన చెయ్యడం వల్లే హైపర్ ఆదికి అవకాశాలు వస్తున్నాయి అని అంటున్నారు.
కానీ అదంతా కేవలం అతని ఏడుగుగాలని చూసి ఓర్వలేక కొంతమంది చేస్తున్న కామెంట్స్ అనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ స్థాయి వ్యక్తి హైపర్ ఆది టాలెంట్ ని గుర్తించి తన సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలకు డైలాగ్స్ రాసే అవకాశం ఇచ్చాడంటే హైపర్ ఆది టాలెంట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, టాలీవుడ్ టాప్ హీరోలందరూ ఇప్పుడు హైపర్ ఆదిని తమ సినిమాల్లో తీసుకుంటున్నారు.ఇది నిజంగా ఆయన టాలెంట్ వల్లే సాధ్యపడింది అని చెప్పొచ్చు.