
Pawan Kalyan
Pawan Kalyan: రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ ను గద్దె దించే లక్ష్యంతో పనిచేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ దిశగా అడుగులను వేగంగానే ముందుకు వేస్తున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీని ఓడించాలంటే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్న రాజకీయ విశ్లేషకులు, సీనియర్ నాయకుల సూచనలను ఆయన పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పొత్తు చర్చలకు సంబంధించి పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారన్న ప్రసారం సాగుతోంది. మెరుగైన అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంటు స్థానాలు పైన పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయనున్నట్లు చెబుతున్నారు.
రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాళ్ళ సందర్భాల్లో బిజెపి రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుర్తిస్తున్నారు. అదే సమయంలో కేంద్ర నాయకత్వం విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ సానుకూల ధోరణితో వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్ర బిజెపి నాయకులు వ్యవహార శైలి, విషయాల్లో రాష్ట్ర నాయకులను మాత్రం తూర్పారబడుతున్నారు.
బిజెపి వస్తే కీలకంగా..
రాష్ట్ర బిజెపి నాయకత్వం విషయంలో విమర్శలు గుర్తిస్తున్న పవన్ కళ్యాణ్ కేంద్ర స్థాయిలోని నాయకుల విషయంలో సానుకూలంగా ఉండడం వెనుక ముఖ్య కారణాలు ఉన్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే అసెంబ్లీ స్థానాలు విషయంలో కంటే పార్లమెంటు స్థానాలు విషయంలో జనసేనాని బలంగా పట్టుబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2024 పార్లమెంటు ఎన్నికల్లోను బిజెపి మరోసారి విజయం చేజిక్కించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో.. రాష్ట్రంలో కనీసం ఎంపీ స్థానాలు గెలుచుకుంటే ప్రధాన మోడీతో ఉన్న సాన్నిత్యం ద్వారా కేంద్రంలో ప్రభావంతమైన స్థాయిలో ఉండాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.

Pawan Kalyan
ఇందుకోసం రాష్ట్రంలోని 25 పార్లమెంటు స్థానాల్లో తొమ్మిది పార్లమెంటు స్థానాలను పవన్ కళ్యాణ్ కోరుతున్నట్లు తెలిసింది. స్థానాల్లో పోటీ చేసేందుకు అవసరమైన అంగ, అర్థబలం ఉన్న నాయకుల అన్వేషణ ఇప్పటికే ప్రారంభమైంది. ఆయా స్థానాల్లో కనీసం 50 నుంచి 100 కోట్లు ఖర్చుపెట్టే బలమైన నాయకులను పవన్ కళ్యాణ్ సిద్ధం చేశారని, ద్వారా 2024 తర్వాత ఢిల్లీ స్థాయిలో ప్రధాన మోడీకి దగ్గర కావాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ తొమ్మిది పార్లమెంటు స్థానాలు విజయమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఆ స్థానాలపై పవన్ కళ్యాణ్ కు స్పష్టత ఉందని, పొత్తు చర్చలు ప్రారంభమైనప్పుడు పెట్టే మొదటి షరతు ఇదే అన్న చర్చ సర్వత్రా నడుస్తోంది. ఏది ఏమైనా గతంతో పోలిస్తే పవన్ కళ్యాణ్ రాజకీయ అడుగులు భిన్నంగా, ప్రణాళికాయుతంగా ఉన్నాయన్నది సుస్పష్టం.