Pawan Kalyan- TDP: ఓటు చీలికపై పవన్ కామెంట్స్ పొలిటికల్ సర్కిల్ లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. నిన్నటివరకూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వనని చెప్పిన పవన్.. ఇప్పుడు మీ ఓటు చీలిపోనివ్వకండని.. మీరు ఎవరికి మద్దతు తెలిపితే వారికే గుంపగుత్తిగా వేయండని కొత్త స్లోగన్ అందుకున్నారు. మీలో మీరు వేరుపడి పలుచనవ్వకండని ప్రజలకు సూచిస్తున్నారు. కొద్దిమంది ఆధిపత్యం చెలాయించే పరిస్థితిలో మార్పు రావాలంటే రాబోయే రెండు ఎన్నికలు కీలకంగా పవన్ అభివర్ణించారు. ఇండైరెక్ట్ గా 2009 టార్గెట్ ను సైతం ఫిక్స్ చేస్తూ మాట్లాడారు. పవన్ తాజా వ్యాఖ్యలతో టీడీపీతో పొత్తు విషయంలో తన ఆలోచన బయటపెట్టినట్టయ్యింది. ప్రధాని మోదీని విశాఖలో కలిసిన తరువాత పవన్ లో చాలారకాలుగా మార్పు వచ్చినట్టు భావిస్తున్నారు. అంతకు ముందు చేసిన కామెంట్స్ కు భిన్నంగా ఇప్పుడు చేయడం ప్రారంభించారు. అలాగని పూర్తిగా బయటకు వెల్లడించడం లేదు. అచీతూచీ అడుగులు వేస్తున్నారు. అటు అధికార పక్షం వైసీపీకి, ఇటు ప్రధాన విపక్షం టీడీపికి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.

Pawan Kalyan- chandrababu
పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో తూర్పుకాపు ప్రతినిధులతో మాట్లాడారు. అక్కడ ఓట్ల చీలిక ప్రస్తావన వచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీలినివ్వకండని.. అలాగని జనసేనకు వేయమని చెప్పనని.. మీకుఅండగా నిలుస్తుందనుకున్న పార్టీగా పూర్తిగా ఓట్లు పడేలా చూసుకోవాలని మాత్రం సూచించారు. దీంతో పవన్ కామెంట్స్ తో సరికొత్త విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. 2024 ఎన్నికల నుంచి బలంగా బీసీల వాణి వినిపిస్తే రాష్ట్ర భవిష్యత్ వెనుకబడిన వర్గాల చేతిలోకి తప్పకుండా వస్తుందన్నారు. లేకపోతే ఆ కొద్దిమంది ఆధిపత్యం తప్పకుండా కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ పరిస్థితి మారాల్సిన అవసరముందన్నారు. అందుకు తగ్గట్టు జనసేన అడుగులు వేస్తుందని.. దానికి మద్దతివ్వాలని పవన్ కోరారు. దీంతో వైసీపీ, టీడీపీ ఆధిపత్యాన్ని పవన్ ప్రశ్నించారని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ రెండు పార్టీలు లేని ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని విశ్లేషిస్తున్నారు.
వైసీపీకి అంతులేని విజయాన్ని అందిస్తే ఆ పార్టీ ఏంచేసిందని ప్రశ్నించారు. మంత్రి బొత్స గురించి ప్రస్తావించారు. ఆయన పెద్ద నాయకుడిగా ఉన్నా నాయకత్వాన్ని తలవంచాల్సిందేనన్నారు. అంత పెద్ద నాయకుడి పరిస్థితి అలా ఉంటూ తూర్పుకాపుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చన్నారు. ఎవరు అధికారంలోకి రావాలన్న అన్ని కులాలు ఓట్లు వేయాలన్నారు. అయితే ఓటుశాతం తక్కువగా ఉండేవారిలో ఐక్యత కనిపిస్తోందని.. ఎక్కవ శాతంలో ఉండేవారిలో అనైక్యత కరువవుతోందని పవన్ అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితి తప్పకుండా మారాలన్నారు. అందుకే రాష్ట్రంలో జనాభాపరంగా ఎక్కువగా ఉన్న బీసీలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరముందన్నారు. ఎన్నికల ముందే సంఘటితం కావాలని.. బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని.. ఆ బాధ్యత జనసేన తీసుకుంటుందని.. దీనికి మద్దతివ్వాలని పవన్ విన్నవించారు. అటు సీఎం జగన్ పైనా సటైర్లు వేశారు. తాను ఉద్దానం కిడ్నీ బాధితులను పరామర్శించలేదని చెబుతున్నారని… నాడు కోడికత్తి డ్రామాలో బిజీగా ఉంటే తాను వెళ్లింది జగన్ కు ఎలా తెలుస్తుందని ఎద్దేవా చేశారు.

Pawan Kalyan- chandrababu
అయితే పవన్ తాజా కామెంట్స్ పై టీడీపీలో కలవరం ప్రారంభమైంది. ప్రధాని మోదీని కలిసిన తరువాత పవన్ లో మార్పును నిశితంగా గమనిస్తున్న టీడీపీ ఏదో జరుగుతోందని అనుమానిస్తోంది. అయితే తాజాగా పవన్ ఓటు చీలిక వ్యాఖ్యతో టీడీపీ నేతలు డిఫెన్స్ లో పడ్డారు. అటు రెండు ఎన్నికలను టార్గెట్ గా ఫిక్స్ చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. అంటే పవన్ 2024 ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు 2029 ఎన్నికలను టార్గెట్ గా పెట్టుకున్నట్టు విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ప్రజల్లో మార్పునకు ప్రయత్నాలు ప్రారంభించారని చెబుతున్నారు. మొత్తానికైతే పవన్ తాజా కామెంట్స్ పొలిటికల్ సర్కిల్ లో పెను దుమారమే రేపుతున్నాయి.