Pawan Sujith Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దూకుడు ప్రస్తుతం మాములు రేంజ్ లో లేదు..ఒక పక్క సినిమాలతో అభిమానులను ఎంత అలరిస్తున్నాడో..మరోపక్క రాజకీయాలతో ప్రజల కష్టాలను తెలుసుకుంటూ అధికార పార్టీ పై అలుపెరగని పోరాటం చేస్తున్నాడు..రెండు అనితర సాధ్యమైన పనులు ఏకకాలం లో సమర్థవతంగా డీల్ చేస్తున్న ఏకైక వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే..అందుకే అభిమానులు ఆయనని ఆరాధ్య దైవం లాగ చూస్తారు.
ఆయన ఏమి చేసిన తమ ప్రాణాలను అడ్డువేస్తారు..ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు అనే భారీ బడ్జెట్ పీరియడ్ జానర్ సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రాన్ని కనివిని ఎరుగని రీతిలో తెరకెక్కిస్తున్నారు..ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో ఇంటర్వెల్ సన్నివేశం ని తెరకెక్కిస్తున్నారు..సుమారు నెల రోజుల నుండి ఈ సన్నివేశం చిత్రీకరణ జరుపుకుంటుంది..ఇదంతా పక్కనా పెడితే పవన్ కళ్యాణ్ మరో క్రేజీ ప్రాజెక్ట్ ని రేపు అధికారికంగా ప్రకటించబోతున్నాడు.
చాలా రోజుల నుండి పవన్ కళ్యాణ్ – సుజీత్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుందని సోషల్ మీడియా లో ఒక వార్త ప్రచారం అవుతూ ఉండేది..అది కేవలం పుకారు మాత్రమే అని చాలా మంది అనుకున్నారు..కానీ అది నిజమే అని ఈరోజు తెలిసింది..రేపు ఉదయం 8 గంటల 55 నిమిషాలకు ఒక సంచలన ప్రకటన చెయ్యబోతున్నాము అంటూ ట్విట్టర్ లో #RRR మూవీ నిర్మాత డీవీవీ దానయ్య ఒక ట్వీట్ వేసాడు..అది పవన్ కళ్యాణ్ – సుజిత్ కాంబినేషన్ కి సంబంధించిన వార్తే అని అధికారికంగా ఖరారైంది.
ఈ ప్రాజెక్ట్ కోసం ఫాన్స్ ఎప్పటి నుండో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు..ఎందుకంటే డైరెక్టర్ సుజీత్ పవన్ కళ్యాణ్ ని వీరాభిమాని..ఒక వీరాభిమాని మనసు పెట్టి సినిమా చేస్తే ఏమవుతుందో గబ్బర్ సింగ్ తో చూసాము..మళ్ళీ ఇప్పుడు సుజిత్ మూవీ కి చూడబోతున్నాము అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు.