Ustad Bhagat Singh Poster: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ వెనుక ఈ ముస్లిమ్స్ ఎందుకు ఉన్నారు?..పూర్తి కథ తెలిస్తే మెంటలెక్కిపోతారు!
కాసేపట్లో ఈ గ్లిమ్స్ వీడియో విడుదల కాబోతుంది, ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ ట్విట్టర్ లో ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఊర మాస్ పోస్టర్ ని విడుదల చేసారు. ఈ పోస్టర్ కి ఫ్యాన్స్ నుండి సెన్సషనల్ రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ లోని వింటేజ్ యాటిట్యూడ్ ని బయటకి తీసుకొచ్చినందుకు ఫ్యాన్స్ అందరూ హరీష్ శంకర్ కి కృతఙ్ఞతలు తెలియచేస్తున్నారు.

Ustad Bhagat Singh Poster: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్ తెరకెక్కుతున్న రెండవ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈమధ్యనే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకొని ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ మీద కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు.మొన్నీమధ్యనే ఎడిటింగ్ వర్క్ ని ప్రారంభించి ఒక అద్భుతమైన గ్లిమ్స్ వీడియో ని కూడా కట్ చేసారు.
కాసేపట్లో ఈ గ్లిమ్స్ వీడియో విడుదల కాబోతుంది, ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ ట్విట్టర్ లో ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఊర మాస్ పోస్టర్ ని విడుదల చేసారు. ఈ పోస్టర్ కి ఫ్యాన్స్ నుండి సెన్సషనల్ రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ లోని వింటేజ్ యాటిట్యూడ్ ని బయటకి తీసుకొచ్చినందుకు ఫ్యాన్స్ అందరూ హరీష్ శంకర్ కి కృతఙ్ఞతలు తెలియచేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ వెనుక ఉన్న ముస్లిమ్స్ ఎందుకు ఉన్నారు, అసలు ఈ చిత్రం ఏ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతుంది అని ఫ్యాన్స్ ఆలోచించడం మొదలు పెట్టారు.అయితే అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ఉండే ప్రాంతం లో ఎక్కువగా ముస్లిమ్స్ ఉంటారట.అక్కడ అధికారులు దౌర్జన్యం తో వాళ్ళ మీద చేసే దాడులను అడ్డుకుంటూ ఉంటాడట పవన్ కళ్యాణ్.
తమకోసం అండగా నిలబడి పోరాటం చేస్తున్నందుకు అక్కడున్న ముస్లిమ్స్ అందరూ పవన్ కళ్యాణ్ ని ఉస్తాద్ అని పిలుస్తుంటారట.అలా ఈ చిత్రానికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే టైటిల్ ని పెట్టారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బెస్ట్ గా ఉండబోతుందట. గబ్బర్ సింగ్ కి పది రెట్లు మించి ఈ చిత్రం ఉండబోతుందని డైరెక్టర్ హరీష్ శంకర్ చెప్తున్నాడు, చూడాలి మరి.