Pawan Kalyan: అటు సినిమాలతో ఇటు రాజకీయాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న పవన్ కళ్యాణ్ ని ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ సీఏ స్టూడెంట్స్ హైదరాబాద్ లో ఏర్పాటు చేసుకున్న మీటింగ్ కి ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. సీఏ బోర్డు మెంబెర్స్ పవన్ కళ్యాణ్ ని కలిసి ఈ సమావేశానికి రమ్మని కోరగా పవన్ వచ్చారు..ఈరోజు శిల్ప కళా వేదికలో ఈ మీటింగ్ ఉదయం నుండి విరామం లేకుండా కొనసాగుతోంది.. పవన్ కళ్యాణ్ సాయంత్రం నుండి ఈ మీటింగ్ లో పాల్గొన్నాడు.

Pawan Kalyan
ఊపిరి సలపనంతా బిజీ షెడ్యూల్ లో కూడా పవన్ కళ్యాణ్ విద్యార్థుల కోసం సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..ఈ కార్యక్రమం లో ఆయన విద్యార్థులను ఉద్దేశిస్తూ చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.. ఆయన మాటలు ప్రతి విద్యార్థిలో చైతన్యం ని నింపేలా చేసింది..ఈ ప్రసంగంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఈరోజు మేము మీముందు ఉంచబోతున్నాము.
ఈ ప్రసంగం లో ఆయన మాట్లాడుతూ ‘మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎప్పటికి మర్చిపోకండి..వాళ్ళే మీకు హీరోలు..మన జీవితం లో మధ్యలో ఎవరు వచ్చినా , ఎవరు వెళ్లినా మన తుది శ్వాస వరకు ప్రేమగా ఉండేది తల్లిదండ్రులు మాత్రమే’ అంటూ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్.. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘నా దృష్టిలో చార్టెడ్ అకౌంట్ ఉన్నంత స్వచ్ఛంగా ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు..జవాబుదారీతనంకి పర్యాయపదం లాంటి వాళ్ళు మీరు’ అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు ఆడిటోరియం మొత్తం దద్దరిల్లిపోతుంది..అయితే ఆయన తన జీవితం లో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలను ఉదహరిస్తూ విద్యార్థుల్లో చైతన్యం నింపే ప్రయత్నం చేసాడు..అందులో భాగంగా ‘నేను రాజకీయం గా ఫెయిల్ అయ్యాను’ అని అంటాడు.

Pawan Kalyan
అందుకు అక్కడున్న అభిమానులు ఏ మాత్రం ఒప్పుకోరు..సీఎం పవర్ స్టార్ సీఎం పవర్ స్టార్ అంటూ ఆడిటోరియం మొత్తం పది నిమిషాల పాటు దద్దరిల్లిపోయ్యేలా విద్యార్థులు అరుపులతో హోరెత్తించారు.. పవన్ కళ్యాణ్ తన ముఖ్య ఉద్దేశ్యం ని కొనసాగిస్తూ ‘నేను 2019 ఎన్నికలలో దెబ్బతిన్నాను..కానీ నేను అక్కడితో ఆగిపోలేదు..నా ఓటమి నుండి నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను..ఈరోజు ఎన్నో ఒడిదుడుగులను ఎదుర్కొని నిలబడ్డాను..మీరు కూడా అలాగే ఉండాలి..CA పాస్ అవ్వడం ఎంత కష్టమో నాకు తెలుసు..ఓటమి వచ్చినప్పుడు కృంగిపోకండి’ అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది.
Your Not a Failed politician @PawanKalyan ! pic.twitter.com/ba2vb7X9Qs
— KARNATAKA PawanKalyan FC™ (@KarnatakaPSPKFC) December 3, 2022