Pawan Kalyan: మా అన్నయ్య వల్ల నేను సూపర్ స్టార్ కాలేదు..నా కష్టం తోనే అయ్యాను: పవన్ కళ్యాణ్
గత ఎన్నికలలో జనసేన పార్టీ కి 7 శాతం వోట్ షేర్ వస్తే, ఈసారి ఎన్నికలలో 12 శాతం కి పైగా వోట్ షేర్ ఉందని, పవన్ కళ్యాణ్ ప్రజాక్షేత్రం లో ఉంటే అది 18 శాతం కి అయినా వెళ్లొచ్చని అంటున్నారు.

Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రభావం ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కింగ్ మేకర్ స్థానం లో ప్రస్తుతం ఆయన ఉన్నాడు, ఆయన తీసుకునే నిర్ణయం ని బట్టే రాబొయ్యే ఎన్నికలలో ఏ ప్రభుత్వం మన ముందుకు రాబోతుందో డిసైడ్ అయ్యి ఉంది.
గత ఎన్నికలలో జనసేన పార్టీ కి 7 శాతం వోట్ షేర్ వస్తే, ఈసారి ఎన్నికలలో 12 శాతం కి పైగా వోట్ షేర్ ఉందని, పవన్ కళ్యాణ్ ప్రజాక్షేత్రం లో ఉంటే అది 18 శాతం కి అయినా వెళ్లొచ్చని అంటున్నారు. అయితే పొత్తు ద్వారా వెళ్తే మాత్రం తెలుగు దేశం – జనసేన పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని స్థాపిస్తాయి అని సర్వేలు తెలుపుతున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా పొత్తు ఉంటుంది అని ఖారారు చేసేసాడు, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు ఏమిటి అనేది ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకుంటారని చెప్పాడు.
ఈరోజు జరిగిన కార్యకర్తల సమావేశం లో ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ నేను సినిమా ఇండస్ట్రీ లోకి మా అన్నయ్య సపోర్టు తోనే వచ్చాను, కానీ సూపర్ స్టార్ స్టేటస్ మాత్రం నా కష్టం తోనే వచ్చింది, ఎవరూ నాకు ఇవ్వలేదు, నేను కస్టపడి సంపాదించుకున్నదే’ అని చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషన్ గా మారింది.
పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో కూడా నిజం ఉంది, మెగా కుటుంబం నుండి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీ కి వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ ని దక్కించుకోలేదు.కెరీర్ ప్రారంభం నుండి ఎంతో కస్టపడి సంపాదించుకున్నదే, రాజకీయాల్లో కూడా అంతే, ఆయనకీ ఎవరి సపోర్టు వెనుక లేదు, మొత్తం ఆయన కష్టం తో సంపాదించుకోవాల్సిందే అని ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా లో అంటున్నారు.
https://twitter.com/Only_PSPK/status/1656991226774847488?s=
