Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో రాజకీయాల్లో రాలేదు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంది. ఒక సంవత్సరం పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి రాబోతున్నారు. అప్పుడు ఆంధ్రా ముఖచిత్రమే మారిపోబోతోంది. పర్చూరు సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన పద్ధతి.. మాటల వాడివేడి స్పష్టత చూస్తే పూర్తిగా పరిణతి చెందిన రాజకీయ వేత్తగా అర్థమవుతోంది.
అదే సమయంలో నిబద్ధత, నిజాయితీతో కూడిన వ్యక్తిగా కూడా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ మాట్లాడిన 40 నిమిషాల వీడియోలో ప్రజల ఆక్రందన, ఆవేదన.. అర్తం చేసుకొని హృదయంలోంచి వచ్చిన మాటలుగా అర్థమవుతోంది.
పవన్ కళ్యాణ్ పై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. టీడీపీ అనుకూల రాజకీయ విశ్లేషకులు సైతం జనసేనను విమర్శిస్తూ మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడింది జనం గోస.. వారి ఆవేదన.. ప్రజలు ఏమనుకుంటున్నారో వారి ఆవేదనను కళ్లకు కట్టారు. పొత్తుల గురించి ఆలోచించనని.. ప్రజలతోనే పొత్తు అని స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే ఆంధ్ర రాజకీయం ఎలా మారబోతోందన్నదానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.