Pawan Kalyan: వైసీపీ గుండాయిజం ని ఎదురుకోవడానికే మేము టీడీపీ తో కలుస్తున్నాం : పవన్ కళ్యాణ్
పవర్ షేరింగ్ అంశం పై విలేఖరులు అడిగిన ప్రశ్నకి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్తూ ‘నాకు కనీసం పోయిన ఎన్నికలలో 40 సీట్లు ఇచ్చినా ఈరోజు పొత్తులో సీఎం అభ్యర్థిగా ఉండేవాడిని, ముందస్తు ఎన్నికలు వస్తే మాత్రం జూన్ నెల నుండే క్షేత్ర స్థాయిలో కార్యాచరణ మొదలు పెడుతాం ‘ అని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మీడియా కి తెలిపాడు.

Pawan Kalyan: ఒక పక్క వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్న పవన్ కళ్యాణ్, మరోపక్క రాజకీయాల్లో కూడా అదే రేంజ్ బిజీ గా ఉంటున్నాడు. పూణేలో #OG మూవీ రెండవ షెడ్యూల్ పూర్తి అవ్వగానే తూర్పు గోదావరి జిల్లా పర్యటనకి బయలుదేరాడు పవన్ కళ్యాణ్.అక్కడ అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించి, సహాయ సహకారాల కోసం ప్రభుత్వాన్ని నిలదీసాడు.
ఆ తర్వాత ఆయన ఈరోజు మంగళగిరి పార్టీ లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ రెండు రోజుల పర్యటనలో ఆయన చూసింది మరియు రాష్ట్ర ప్రయోజనాల గురించి భవిష్యత్తు కార్యాచరణపై పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యకర్తలకు మార్గనిర్దేశం చేసాడు. ముఖ్యంగా 2024 ఎన్నికలలో పొత్తుల గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసాడు. అవి ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
ఆయన మాట్లాడుతూ ‘ప్రస్తుతం BRS పేరుతో పిలవబడుతున్న TRS పార్టీ కూడా ఒకప్పుడు పొత్తులతో బలపడిన పార్టీనే.బీజేపీ పార్టీ కూడా అలాగే బలపడింది, మా ఏకైక లక్ష్యం 2024 ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకూడదు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి YCP పార్టీ నుండి విముక్తి కలిగించాలి, ఇదే ప్రధాన లక్ష్యం. అందుకోసం పార్టీలన్నీ కలవాల్సిన అవసరం ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్.
ఇక పవర్ షేరింగ్ అంశం పై విలేఖరులు అడిగిన ప్రశ్నకి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్తూ ‘నాకు కనీసం పోయిన ఎన్నికలలో 40 సీట్లు ఇచ్చినా ఈరోజు పొత్తులో సీఎం అభ్యర్థిగా ఉండేవాడిని, ముందస్తు ఎన్నికలు వస్తే మాత్రం జూన్ నెల నుండే క్షేత్ర స్థాయిలో కార్యాచరణ మొదలు పెడుతాం ‘ అని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మీడియా కి తెలిపాడు.
