
Pawan Kalyan- Telangana
Pawan Kalyan- Telangana: ‘నేను అంతా కలిపితే పిడికెడు మట్టి కావొచ్చు. తల ఎత్తి చూస్తే ఒక దేశపు జెండాకు ఉన్నంత పొగరు ఉంటుంది’ ఇలా మాట్లాడాలి అంటే గుండె ధైర్యం కావాలి. అన్నింటికీ మించి తెగువ కావాలి. ఆ తెగువ ఉంది కాబట్టే పవన్ కల్యాణ్ అంటే ఏపీలో క్రేజ్ ఉంటుంది. తెలంగాణలో తక్కువ ఉంటుంది అనుకోవడానికి లేదు. ఏపీలో ఆయన ఎన్నికల్లో ఓడిపోవచ్చు గాక. కానీ ఆ ఓటమి ఆయన్ను ఏపీ నుంచి విడదీయలేదు. ‘యుద్ధం చేయడం మన చేతిలో ఉంటుంది. గెలుపుఓట మి అనేది ఎదుటి వాడి చేతిలో ఉంటుంది’ అనే వ్యక్తి గురించి చెప్పేందేకు ఎన్ని ఉపమానాలు వాడినా ఆ వ్యక్తిత్వం కొలమానాలకు అందదు.
పేరుకు విడిపోయినప్పటికీ ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రోజులు లేవు. ఉద్యమ సమయం ఉంటే ఉండవచ్చేమో గానీ.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రాను రాను ఇంకా సోదరభావం పెరిగే అవకాశమే ఉంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఆంధ్రాతో పోలిస్తే ఇక్కడ ఉద్యమ స్ఫూర్తి, మనుషుల్లో సంఘటిత భావన ఎక్కువ. అందుకే తెలంగాణ ఉద్యమ సమయంలో సబ్బండ వర్ణాలు రోడ్డు మీదకు వచ్చాయి. కులం, వర్గం, వర్ణం తో సంబంధం లేకుండా పోరాడాయి. చిరకాల కాంక్షను నెరవేర్చుకున్నాయి. కానీ ఇదే స్ఫూర్తి ఆంధ్రాలో ఉండదు. ఈ మాటలు అన్నది కూడా పవన్ కల్యాణే.
మొన్నామధ్య జనసేన పదో వార్షిక వేడుకలు జరిగాయి. ఈసందర్భంగా పవన్ కల్యాణ్ చాలా ఉద్వేగంగా మాట్లాడారు. తన పదేళ్ల జన సేన ప్రయాణాన్ని చాలా వివరంగా, అర్థవంతంగా చెప్పారు. ‘నేను ధర్మం కోసం నిలబడే మనిషిని. మీరు మాత్రం కులం కోసం పాకులాడుతున్నారు. సినిమాల్లో నువ్వంటే ఇష్టం. కానీ ఓటు మాత్రం మా కులపోడికి వేసుకుంటాం. అంటే నేనేం చేయాలి? ఇదే పరిస్థితి తెలంగాణలో ఉంటే కచ్చితంగా పోరాడేవారు. నీ వెంట మేమున్నాం అని భరోసా కల్పించేవారు. కానీ ఆంధ్రాలో అలా కాదు. ఇక్కడ కులాల రొంపి ఎక్కువ. అందుకే నేను ఒంటిరి వాన్ని అయ్యాను. తిరుపతి వెళ్తుంటే అలిపిరి స్టాటింగ్ పాయింట్ వద్ద ధర్మో రక్షతిః రక్షితః అనే సూక్తి ఉంటుంది. నేను దాన్ని అనుసరించేవాణ్ణి’ అంటూ పవన్ తన మననసులో ఉన్న బాధను మొత్తం బయట పెట్టాడు. ఒకానొక దశలో తాను మాన్ప్రడిపోయాడు. ఎంతటి ఆవేదన ఉంటే ఇంతటి మాటలు వస్తాయి? ఒక జాతి ఇబ్బంది పడుతుంటే నేనున్నా భుజం కాసేందుకు అని ముందుక రావడం మాములు విషయం కాదు. కానీ ఆ ముందకు వచ్చిన వ్యక్తిని దూరం చేసుకున్న ఏపీ ప్రజలు నిజంగా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి.

Pawan Kalyan- Telangana
సాధారణంగా రాజకీయ నాయకులు తమ కోసం రాజకీయాలు చేస్తారు. ప్రజల కోసం చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తారు. కానీ పవన్ అలా కాదు. ఉన్నది ఉన్నట్టే చెప్పాడు. చెబుతాడు. తనలో మరోకోణం ఉంటే, దాచుకోవాలి, దోచుకోవాలి అనే యావే ఉంటే.. లక్షలాది మంది జనం ఉన్న చోట నా రోజూవారీ సంపాదన రెండుకోట్లు అని ఎలా చెప్పగలడు? ఏపీ వాళ్లకు కులాల యావ ఎక్కువ అని ఎలా అనగలడు? రేపటి భవిష్యత్ కోసం మనం పోరాటం చేద్దాం? తెలంగాణ వాళ్లతో పోలిస్తే మీలో పోరాట స్ఫూర్తి లేదు, ఇది సరికాదు అని ఎలా నిలదీయగలడు. ఎందుకంటే అతడు కుళ్లు రాజకీయాలు చేసే కుహానా రాజకీయ నాయకుడు కాదు. నిగ్గదీసి అడుగుతాడు. అగ్గితోని సమాజాన్ని కడుగుతాడు. రేపటి ఉదయాన్ని అతడు సాక్షాత్కరింపజేస్తాడు. అందుకు అతణ్ని రవిని చేయాలా? లేక చీకట్లో మగ్గిపోవాలా అనేది ఏపీ ప్రజల చేతుల్లోనే ఉంది. ఎందుకంటే పవన్ తెలంగాణలో ప్రభవించే అవకాశం లేదు కాబట్టి.. ఆ అవకాశం ఉంటే తెలంగాణ ప్రజలు అతణ్ణి వదులుకోలేరు కాబట్టి.